వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరినా ఫర్ కరుణానిధి: రజనీ-రాహుల్ డిమాండ్, మోడీతో స్టాలిన్ రెడీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై డీఎంకే కేడర్ మండిపడుతోంది. డీఎంకే హింసకు దిగుతోందని తెలుస్తోంది. మరోవైపు, మెరీనాలో అవకాశం ఇవ్వకపోవడంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.

కరుణానిధికి మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకపోవడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించారు. గొప్ప నాయకుడికి గౌరవం ఇవ్వాలని తాను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని చెప్పారు. మెరీనా బీచ్ వద్ద కరుణ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వాలన్నారు. అన్నాదొరై సమాధి వద్దే అంత్యక్రియలకు అనుమతివ్వాలన్నారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిగేలా చూడాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Major Controversy Breaks Out as Tamil Nadu Govt Denies Space for Karunanidhi

మరోవైపు, కరుణానిధి అంత్యక్రియల స్థలంపై మద్రాస్ హైకోర్టులో విచారణ ప్రారంభిమైంది. డీఎంకే పిటిషన్ పైన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా కరుణానిధి మృతి నేపథ్యంలో రేపు (బుధవారం) భారత ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది.

English summary
AICC president Rahul Gandhi, Super Star Rajinikanth Join ‘Marina For Karunanidhi’ Chorus, Madras HC to Hear DMK Plea Shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X