వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు తెలంగాణ, కోస్తాలో మోస్తరు వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎండ వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో 3.1కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. అది రానున్న 36గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

వాయుగుండా వాయువ్యంగా పయనించి తుఫాన్‌గా బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది దక్షిణ తమిళనాడు తీరం దిశగా కదులుతుందని అంటున్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, కోస్తా ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది.

Major cyclone in the making; may cross North TN coast

ఏర్పడిన కారణంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో శ్రీలంకకు ఆగ్నేయ దిశగా గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తదుపరి 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పుతీర ప్రాంత వెంబడి వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించి, ఆ తదుపరి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

English summary
A low-pressure region with a potential of morphing into a tropical cyclone is brewing in the far-east of the Bay of Bengal. After intensifying, the system may or may not strike the coast of southern India in the coming few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X