వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కే స్టూడియో భారీ అగ్ని ప్రమాదం: తప్పిన పెనుముప్పు

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఆర్కే సినిమా స్టూడియోలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకటో నంబర్‌ హాల్‌ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరిం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఆర్కే సినిమా స్టూడియోలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకటో నంబర్‌ హాల్‌ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.

విద్యుదాఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. స్టుడియోలో కొద్దిరోజులుగా విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని టీవీ షో 'సూపర్‌ డ్యాన్సర్‌' సెట్‌ ఉంది.

అయితే, శనివారం కావడంతో సెట్‌ ఖాళీగా ఉంది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఈ స్టుడియోను బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు రాజ్‌కపూర్‌ 1948లో స్థాపించగా, ప్రస్తుతం ఆయన కుమారుడు రిషి కపూర్‌ దాని యజమానిగా కొనసాగుతున్నారు.

English summary
A major fire broke out at famous Raj Kapoor Studio in Mumbai.The fire broke out at the sets of TV show 'Super Dancer'. There was no crew on the set at the time of incidence.
Read in English: Fire at RK Studio in Mumbai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X