వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ మెట్రో సమీపంలో చెలరేగిన మంటలు .. సర్వీసుకు అంతరాయం ... రంగంలోకి 17 ఫైరింజన్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కలింది కంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో పరిసరాల్లో ఉన్న జనం హడలెత్తిపోయారు. ఫర్నీచర్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని .. ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

మెట్రో స్టేషన్ సమీపంలో ..
ఫర్నీచర్ మార్కెట్ కలింద్ కంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. దీంతో భారీగా మంటలతో పొగ కమ్మంది. దీంతో మాజెండా లైన్ మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో సర్వీస్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 5.55 గంటలకు ఫర్నీచర్ మార్కెట్ నుంచి మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. వారి సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. దాదాపు 17 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే మంటలు ఎలా చేలరేగాయనే అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు.

Major fire breaks out near Delhis Kalindi Kunj Metro, Magenta Line services affected

సర్వీసులకు అంతరాయం ...
కలింద్ కంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో మంట చెలరేగడంతో మాజెంట్ లైన్ గుండా వచ్చే మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు బ్లూ లైన్ గుండా నోయిడా చేరుకోవాలని ఢిల్లీ మెట్రో సర్వీసెస్ ఒక ప్రకటనలో కోరింది. ఉదయం నుంచి కొన్నిగంటల పాటు మాజెంట్ లైన్ స్థంభించిపోయింది. ప్రస్తుతం సేవలను పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు.

English summary
a major fire broke out at the furniture market near Delhi's Kalindi Kunj metro station early on Friday morning. The massive fire disrupted services on the Magenta Line metro for several hours. Services have resumed now. Seventeen fire tenders were rushed to the spot in Kalindi Kunj. The fire was reported around 5:55 am and it is yet to be doused down. The reason behind the huge fire is not known yet. Delhi Metro services on the Magenta Line were widely affected due to the fire during peak hours. The DMRC issued a statement to advise passengers to take the Blue Line to reach Noida instead of Magenta Line, which was disrupted for several hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X