వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శైలజను చంపి మరో గర్ల్‌ఫ్రెండ్‌కు చెప్పిన మేజర్, ఒకరికి తెలియకుండా మరో మహిళతో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సహచర ఆర్మీ మేజర్ సతీమణి శైలజ ద్వివేదిని హత్య చేసిన నిందితుడు నిఖిల్ హండా.. ఈ విషయాన్ని తన మరో స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పాడు. నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోన్న విషయం తెలిసిందే. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఈ హత్య గురించి హండా మరో స్నేహితురాలికి తెలిపాడని, దర్యాఫ్తు సమయంలో అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా, విచారణలో వెల్లడైందని చెప్పారు. ఢిల్లీలో ఆయనకు కనీసం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపారు. హత్య విషయం తెలిపిన ఆ మహిళతోను లిండాకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలిపారు.

ఫేక్ ప్రొఫైల్‌తో వల: శైలజను చంపిన మేజర్‌కు మామూలోడు కాదు, మరో ముగ్గురు మహిళలతోను!ఫేక్ ప్రొఫైల్‌తో వల: శైలజను చంపిన మేజర్‌కు మామూలోడు కాదు, మరో ముగ్గురు మహిళలతోను!

Major Nikhil Handa misleading us, killer weapon yet to be recovered: Delhi Police on Army officers wifes murder

శైలజను హత్య చేస్తున్నట్లు హండా ముందుగానే చెప్పినప్పటికీ ఆమె నమ్మలేదని తెలిపారు. ఆ విషయం చెప్పగానే ఆమె ఫోన్ కట్ చేసిందని, దానిని నమ్మకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆమెను కూడా విచారించామని, ఆమెకు ఏమీ తెలియదని తేలిందన్నారు.

ఈ మహిళతో హండాకు ఉన్న సంబంధం గురించి ఆమె బంధువులకు తెలియదన్నారు. ఫేక్ అకౌంట్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి 2015 నుంచి అతను మహిళలతో స్నేహం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే శైలజను కూడా పరిచయం చేసుకున్నాడని, ఇద్దరు ఆర్మీలో ఉండటంతో ఓ గెట్ టుగెదర్ పార్టీలో ప్రత్యక్షంగా కలుసుకున్నారని తెలిపారు.

ఆ తర్వాత వారి మధ్య పరిచయం, అతను పదేపదే పెళ్లి ప్రతిపాదన తీసుకు రావడం, శైలజ తిరస్కరించడంతో చంపేశాడని చెప్పారు. ఒకరికి తెలీకుండా మరొకరితో అతడు సంబంధాలు కొనసాగించేవాడని తెలిపారు. మైగ్రేన్ చికిత్స చేయించుకోవాలని చెప్పి అతను ఢిల్లీలోని కంటోన్మెంట్‌‌కు వచ్చాడన్నారు. అప్పుడే శైలజ వచ్చిందని, అప్పుడే హత్య జరిగిందన్నారు. ఇదిలా ఉండగా, హండా తమను మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయుధాన్ని గుర్తించవలసి ఉందన్నారు.

English summary
In the Army Major's wife's murder case, the Delhi police said on Wednesday that the weapon that they had in their custody was not the weapon with which Shailja Dwivedi was killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X