వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: భారత గగనతలంలోకి పాక్ ఆర్మీ హెలికాప్టర్! 10 సెకండ్లకే తోకముడిచి...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. హద్దుమీరి సరిహద్దులో పిల్ల చేష్టలు చేయబోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ అక్రమంగా భారత గగనతలంలోకి ప్రవేశించింది.

పూంఛ్ సెక్టర్‌లో నియంత్రణ రేఖను దాటి సుమారు 300 మీటర్లు భారతదేశంలోకి చొచ్చుకొచ్చింది. దాదాపు 10 సెకండ్లపాటు ఈ హెలికాప్టర్ మన దేశ గగనతలంలో సంచరించి, తిరిగి పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదు.

pakistan-chopper

ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్‌ బుధవారం హెలికాప్టర్‌తో ఏకంగా దేశంలోకి చొరబడే దుస్సాహాసానికి ఒడిగట్టింది. పూంచ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన పాక్ హెలికాప్టర్‌ను చూడగానే భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాక్ ఆర్మీ హెలికాప్టర్ వెంటనే తోకముడిచింది.

ఒకవేళ పాక్ ఆర్మీ హెలికాప్టర్ తిరిగి వెనక్కి వెళ్లడం ఏమాత్రం ఆలస్యం చేసినా భారత బలగాల చేతుల్లో అది నేలకూలి సంచలనంగా మారేది. మరోవైపు పాక్ ఆర్మీ దుస్సాహసంపై భారత ఆర్మీ అధికారులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఈ ఘటనను తేలిగ్గా వదిలేయరాదని భారత ఆర్మీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భారత్‌లోని పాక్ హైకమిషనర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే, పాక్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే యోచన చేస్తున్నారు.

English summary
In a major provocation, a Pakistani military chopper came close to the Line of Control in Jammu and Kashmir on Wednesday. Army sources said the military helicopter came up to 300 metres of the LoC in Poonch district earlier in the day. Indian troops on the ground were able to see the chopper. Army sources said the incident took place between 9.45 am and 10 am today, and it was in the general area Pallandri in Pakistan-occupied Kashmir. They added that the Pakistan military helicopter returned after flying close to the Line of Control. as per established norms, an Army chopper should not come within one kilometre of the LoC. In case the chopper has to come this close to the LoC, a prior permission needs to be sought from India. Just days ago, the Indian Army had foiled an attempt by a group of terrorists to intrude into the Indian territory under the cover of Pakistani firing from across the LoC in Poonch district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X