వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే స్టేషన్లలో కూడ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌.

|
Google Oneindia TeluguNews

రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం కానుంది. స్టేషన్ ప్రవేశ ద్వారాలను విమానాశ్రాయాల ఎంట్రన్స్ వలే కట్టుదిట్టమైన ఎర్పాట్లు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈనేపథ్యంలోనే రైల్వేస్టేషన్లలో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సాధరణంగా రైల్వే స్టేషన్లు అనగానే కిలోమీటరు మేర ఏటునుండైన లోపలికి వెళ్లేందుకు వీలుంటుంది.ఇక కొత్త విధానం ద్వార విమానాశ్రాయాల వలే కొత్త సెక్యూరిటీ

యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను తీసుకురాబోతుంది భారత రైల్వే శాఖ.దీంతో కొన్ని ఎంట్రన్స్‌ల ద్వారనే రైల్వే స్టేషన్ల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.అయితే ఈ విధానం కోన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ఎంట్రన్స్‌ల వద్ద ఎలక్ట్రానిక్‌ అత్యధునికమైన పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్పీఎఫ్‌ కమాండోలు భద్రతను పర్యవేక్షిస్తారు.సెక్యూరిటీ కంట్రోల్‌ సిస్టమ్‌‌ను ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 114.18 కోట్లను మంజూరు చేసింది.

'

Major railway stations would have access control system

దేశంలో ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో భద్రత అంతంత మాత్రమే ఉందని, చాలా చోట్ల ఎట్రన్స్‌లతో పాటు ఎగ్జిట్ ద్వారాలు అనేకం ఉన్నాయి. దీంతో అనధికార వ్యక్తులు లోపలికి ప్రవేశించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎట్రన్స్‌లతో పాటు ఎగ్జిట్ ద్వారాల అనధికార వ్యక్తుల రాకను అడ్డుకోవాలని నిర్ణయించామని ఆర్పీఎఫ్‌ డీజీ అరుణ్‌కుమార్‌ తెలిపారు. కాగా గతంలో ఉగ్రదాడులు జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కొత్త విధానంలో ప్రయాణికులు సెక్యూరిటీ చెకింగ్‌ కోసం ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు..

English summary
Major railway stations would have access control system at par with security rrangements seen at airports across the country to ensure top-grade safety of the passengers and goods
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X