వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు: పెను ప్రమాదం తప్పించిన లోకో పైలట్, ఎలాగంటే..?

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతో వ్యవహరించడంతో ఈ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు ప్రయాణికులు. తమిళనాడులోని జాఫర్‌పేట్ ప్రాంతంలో మంగళవారం రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ప్రయాణించాయి.

కొద్ది దూరంలో రెండు రైళ్లు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వీటిలో ఒకటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలు కాగా, మరోటి కాట్పడి నుంచి చెన్నైకి నీళ్లు తరలిస్తున్న రైలు. ఈ రెండూ 150 మీటర్ల దూరంలో ఉండగా ఎదురుగా వస్తోన్న రైలును లోకో పైలట్ గుర్తించి నిలిపివేశారు.

 Major train accident averted in Tamil Nadu, 2 trains set for head-on collision stopped just in time

వెంటనే కిందికి దిగి ఎదురుగా వస్తున్న రైలు లోకో లైకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ రైలును కూడా లోకో పైలట్ ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా రైలును నిలిపివేయడంతో ప్యాసింజర్ ప్రయాణికులు ఏమైందోనని ఆందోళన చెందారు.

అయితే, విషయం తెలిసిన తర్వాత పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామంటూ ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన లోకోపైలట్‌ను పలువురు అభినందించారు. కాగా, ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎలా వచ్చాయనే విషయంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

English summary
A major train accident was averted in Tamil Nadu on Tuesday morning as two trains came on the same track in the state’s Vellore district. As per details available, the train came on the same track at Katpadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X