వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..

|
Google Oneindia TeluguNews

బెంగాల్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. టైం దొరికినప్పుడల్లా బీజేపీపై దీదీ విరుచుకుపడుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తీసిన ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై దీదీ మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. చాలా రోజుల తర్వాత ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన దీదీ.. మోడీపై ఫైరయ్యారు.

 Majority doesnt allow you to kill people: Mamata

ఢిల్లీ ఘటనలో ఇంటలెజెన్స్ ఫెయిల్యూర్ ఏమీ లేదని మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యమాన్ని కేంద్రం సరిగా నిర్వర్తించలేకపోయిందని చెప్పారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తతో వ్యవహరించి ఉండాల్సింది అని దీదీ తెలిపారు. పంజాబ్ సోదరులు ఐకమత్యంతో ఉన్నారని.. ఇతర ప్రాంతాల్లో కూడా అదే యూనిటీ కనిపించిందని తెలిపారు. బెంగాల్‌.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితి ఉందని చెప్పారు.

Recommended Video

Telangana TDP President L Ramana Participated In 72nd Republic Day Celebrations

ప్రజాస్వామ్యంలో మెజార్టీ అనేది ఓటు కోసం/ అధికారం కోసమేనని మమతా బెనర్జీ తెలిపారు. ప్రజలను చంపేందుకు మెజార్టీ అవసరం లేదని ఆమె చెప్పారు. గతంలో రాజీవ్ గాంధీకి కూడా అధిక మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా మెజార్టీ ఉందని వివాదాస్పద వ్యవసాయ బిల్లులను చట్టం చేశారని పేర్కొన్నారు. కరోనా సమయంలో బిల్లులను పాస్ చేశారని ఆరోపించారు. చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఎందుకు అంత జంకుతున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దీంతో రైతులకు నష్టం జరుగుతుందని చెప్పినా.. ఎందుకు వినిపించుకోవడం లేదని అడిగారు.

English summary
Is it not the intelligence failure of the central government? Is it not bad handling of the movement? The government should have been more careful bengal cm mamatha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X