వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

march 20, 2020.. యోగాతో సత్ప్రవర్తన: పాఠ్యాంశాల్లో చేర్చాలి, చొరవ తీసుకోవాలి: రాందేవ్ బాబా..

|
Google Oneindia TeluguNews

నిర్బయ దోషులను ఉరి తీయడంతో యావత్‌జాతి హర్షం వ్యక్తం చేస్తోంది. యువత సంబరాలు చేసుకుంటోంది. దోషులకు శిక్ష అమలు చేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ స్వాగతించారు. ప్రముఖులు కూడా స్పందించారు. అయితే యోగాగురువు రాందేవ్ బాబా కాస్త భిన్నంగా రియాక్టయ్యారు. దేశంలో లైంగికదాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చారు.

దోషులు అక్షయ్, ముఖేశ్, పవన్, వినయ్ ఉరిశిక్ష విధించి న్యాయవ్యవస్థ కొత్త చరిత్ర సృష్టించింది. మరొకరు తప్పు చేయాలంటే ఈ ఘటన గుర్తుచేసుకొని భయపడాలని రాందేవ్ బాబా అన్నారు. అయితే అత్యంత పాశవికంగా జరిగిన లైంగికదాడితో ప్రపంచం ముందు భారతదేశ పరువుపోయిందని చెప్పారు. నిర్భయ లాంటి ఘటన దేశానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అంగీకరించారు.

Make yoga part of curriculum to stop Nirbhaya-like rapes, Ramdev baba

దేశంలోని విద్యా వ్యవస్థను కాస్త ప్రక్షాళన చేయాలని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. పాఠశాల స్థాయి పాఠ్యాంశాల్లో యోగాను తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ముందుకు రావాలని, పేరంట్స్ కూడా పిల్లలకు యోగాపై అవగాహన కల్పించాలని సూచించారు. యోగా నేర్చుకోవడంతో మానసికంగా ఉత్సాహంగా ఉండి.. చెడు ఆలోచనలు రావు, రాబోవనే ఉద్దేశంతో రాందేబ్ బాబా హితవు పలికారు.

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines : Key Points Of YS Jagan, Narendra Modi Meet

రాందేవ్ వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం ఉంది. నిర్బయ ఘటనను యావత్ జాతి ముక్తకంఠంతో ఖండించింది. దోషులకు ఉరిశిక్ష విధించిన సమయంలో చేసిన వ్యాఖ్యల విపక్షాల ఆగ్రహానికి గురిచేసే ఛాన్స్ ఉంది. యోగా నేర్పాలనే పేరుతో.. ఘటనను తక్కువ చేసి చూపడం సరికాదని విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.

English summary
Make yoga part of curriculum to stop Nirbhaya-like rapes yoga guru Ramdev baba said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X