వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభంజనానికి ‘కర్ణాటకం’ అగ్ని పరీక్షే!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనెదుర్కొన్న ప్రధాని నరేంద్రమోదీకి ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి, ఎన్డీయే నుంచి టీడీపీ నిష్క్రమణ సవాల్‌గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభంజనానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రధాని నరేంద్రమోదీ తన అస్త్ర శస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సజావుగాఅధికారం చేపట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీకి వీలవుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభావితం చేయగల సామర్థ్యం గల నేతలందరినీ రంగంలోకి దించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఉధ్రుత ప్రచారం, క్షేత్రస్థాయిలో అదనంగా జన సమీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు కమలనాథులు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మరో అతిపెద్ద రాష్ట్రాన్ని చేజిక్కించుకునే లక్ష్యంతో కాషాయ పార్టీ ముందుకు సాగుతున్నది.

మిత్రపక్షాల నుంచే విమర్శలు.. మూడు అవిశ్వాసాలు

మిత్రపక్షాల నుంచే విమర్శలు.. మూడు అవిశ్వాసాలు

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో గట్టి పోటీ, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ప్రధాని మోదీ చరిస్మా తగ్గుముఖం పట్టిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని అధికార ఎన్డీయే మిత్ర పక్షాలతోపాటు విపక్షాలన్నీ ప్రధాని మోదీ పనితీరుపై విమర్శల జోరు పెంచాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. తాజాగా మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మరో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చింది.

 విపక్షాల మధ్య ఐక్యత ద్విగుణీక్రుతం

విపక్షాల మధ్య ఐక్యత ద్విగుణీక్రుతం

బీజేపీ ప్రజాదరణ క్రమంగా తగ్గుముఖం పట్టగా, విపక్షాల మధ్య ఐక్యత రోజురోజుకు ద్విగుణీక్రుతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొటములను బట్టే 2019 ఎన్నికల రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. మోదీ సారథ్యంలోని హిందూ జాతీయవాదానికి పరీక్ష కానున్నది. క్షేత్ర స్థాయిలో బూత్ నుంచి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల సాధనే లక్ష్యంగా అన్ని రకాల వ్యూహాలు ఖరారు చేశామని బీజేపీ కర్ణాటక అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ తెలిపారు. 1985 నుంచి క్రమంగా కర్ణాటకలో బలోపేతం అవుతున్న బీజేపీ గెలుపునకు ప్రధాని మోదీ ప్రజారణ కీలకం కానున్నది.

యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలతో విస్త్రుత ప్రచారానికి బీజేపీ ప్లాన్

యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలతో విస్త్రుత ప్రచారానికి బీజేపీ ప్లాన్

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి 56 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో ఏడు లక్షల మంది వలంటీర్లు పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక రాష్ట్రాన్ని చుట్టేయనున్నారని బీజేపీ కర్ణాటక అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కర్ణాటక రాష్ట్రంలో సాగునీటి రంగానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని బీజేపీ ప్రతీన బూనింది. శాంతిభద్రతల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన, అవినీతి రహిత పాలన అందిస్తామని బీజేపీ హామీలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వ అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం తదితర అంశాలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పంటలకు మద్దతు ధర పెంపొందిస్తామని బీజేపీ హామీలు గుప్పిస్తోంది.

 80 లక్షల మంది రైతులకు ఆధారం సేద్యమే

80 లక్షల మంది రైతులకు ఆధారం సేద్యమే

భారతదేశానికి ఐటీ హబ్ వంటిది కర్ణాటక. 80 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారు. ఇప్పటికీ బీజేపీకి చిన్న పట్టణాలు, నగరాల్లో మద్దతు కలిగి ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో రైతుల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 224 స్థానాలు గల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దరామయ్య ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేదని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. రెండు ఒపీనియన్ పోల్స్ ప్రకారం మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలోని సెక్యులర్ జనతాదళ్ (జేడీ-ఎస్) కింగ్ మేకర్‌గా వ్యవహరించనున్నది. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ప్రకటిస్తూ బీజేపీ కలిసి పని చేయడానికే జేడీఎస్ ఎక్కువ ఆసక్తి చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

జేడీఎస్ పట్ల గ్రామీణుల్లో సానుకూలత

జేడీఎస్ పట్ల గ్రామీణుల్లో సానుకూలత

కానీ అన్నదాతలు మాత్రం బీజేపీ అంటే మండిపడుతున్నారు. గత నెలలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ.. రైతుల సమస్యల పరిష్కారానికి ‘టాప్ (టీవోపీ)' ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇక్కడ టాప్ అంటే టొమాటో, ఆనియన్ (ఉల్లిగడ్డ), ఆలుగడ్డ (బంగాళాదుంప - పొటాటో) అని అర్థం. బీజేపీ ప్రభుత్వం అంటే సంపన్నుల అనుకూల ప్రభుత్వం అని, తమ సమస్యలు పట్టించుకోరని, అసలు వాటిని అర్థం చేసుకోరని రైతులు అంటున్నారు. రైతుల వద్దకు జేడీఎస్ నేతలు మాత్రమే వస్తారని, తాము ఆ పార్టీకే ఓటేస్తామని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందితే దక్షిణాదిలో అడుగు పెట్టడంతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోరాడేందుకు బీజేపీకి నైతిక బలం లభిస్తుంది.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఆ పై సార్వత్రిక పోరుకు ఆత్మస్థైర్యం ఇలా

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఆ పై సార్వత్రిక పోరుకు ఆత్మస్థైర్యం ఇలా

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందని కర్ణాటక యూనివర్శిటీ రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ హరీశ్ రామస్వామి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే ఈ ఏడాది చివరిలో జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమాయత్తం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో ఆత్మస్థైర్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత బియ్యం పంపిణీ చేయడంతోపాటు పాఠశాలల్లో ఉచితంగా పాలు గుడ్లు సరఫరా, విద్యార్థులకు ఉచిత బస్ పాస్, రైతులకు పంట రుణాల మాఫీ వంటి పథకాలు సాధించిన ప్రగతి గురించి అధికార కాంగ్రెస్ పార్టీ విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది.

ఇప్పటికీ మోదీ యువతకు ఆకర్షణీయ నేతే

ఇప్పటికీ మోదీ యువతకు ఆకర్షణీయ నేతే

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బ్రిజేశ్ కలప్ప మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తమ ఎన్నికల ప్రచార బడ్జెట్ కు నిధులు పలు రెట్లు పెంచామని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందితే పార్టీకి పునర్జీవంతోపాటు 2019 ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుగుతుందని తెలిపారు. కానీ ఇప్పటికి బీజేపీ ప్రధాన ప్రచారకర్త ప్రధాని నరేంద్రమోదీ.. ప్రత్యేకించి యువతకు ఆకర్షణీయంగా ఉన్నారు.

రెండు సర్వేల సారాంశాన్ని అధ్యయనం చేస్తున్న ఏఐసీసీ హై కమాండ్

రెండు సర్వేల సారాంశాన్ని అధ్యయనం చేస్తున్న ఏఐసీసీ హై కమాండ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ నిర్వహించిన రెండు వేర్వేరు సర్వేల్లో సదరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గా లేదని, వారి విజయావకాశాలు తక్కువేనని తేలింది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రెండు సర్వేల సారాంశాన్ని ఏఐసీసీ హైకమాండ్ సునిశితంగా పరిశీలిస్తోంది. ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలా? ఎవరికి టిక్కెట్ ఇవ్వకూడదన్న విషయం కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేయనున్నది. దీని విషయమై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య చర్చ జరుగుతోంది.

గెలుపే ప్రధానంగా అభ్యర్థులను ఖరారు చేయాలన్న సిద్దరామయ్య

గెలుపే ప్రధానంగా అభ్యర్థులను ఖరారు చేయాలన్న సిద్దరామయ్య

అవసరమైన అసెంబ్లీ స్థానాల పరిధిలో కొత్త అభ్యర్థులకు చోటు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నారు. కానీ సీఎం సిద్దరామయ్య మాత్రం గెలుపే ప్రాధాన్యం కావాలని సూచిస్తున్నారు. కొత్త వారికి అవసాశమించినా.. గెలుపొందే అవకాశాలు తక్కువని సిద్దరామయ్య చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఐసీసీ కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జి మధుసూదన్ మిస్త్రీ సారథ్యంలోని స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించేందుకు సిద్ధమవవుతోంది. ఈ నెల 28, 29 తేదీల్లో మధుసూధన్ మిస్త్రి సారథ్యంలోని కమిటీ తుది నిర్ణయం తీసుకోనున్నది.

English summary
Following a tough fight in his home state of Gujarat, defeats in three key by-elections last week and the desertion of an ally from his ruling coalition, Modi’s standing in the electorate appears weakened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X