సూపర్ స్టార్ కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ: వెల్ కమ్ టు సెంట్రల్ జైల్, చిప్పకూడు !
మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ ను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి దిలీప్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
కొచ్చి: మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ ను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి దిలీప్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఆయన్ను అంగమాలై న్యాయస్థానం న్యాయమూర్తి ఇంటిలో హాజరుపరిచారు.
మళయాలం నటిపై లైంగిక దాడి: హీరో దిలీప్ మాజీ భార్య మంజు విచారణ, దిలీప్ గురించి !
మంగళవారం ఉదయం హీరో దిలీప్ ను కొచ్చి నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని అలువా ప్రాంత సెంట్రల్ జైలుకు తరలించారు.జైలు దగ్గర కొందరు యువకులు దిలీప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్ కమ్ టు సెంట్రల్ అంటు నినాదాలు చేశారు.
దిలీప్ హీరోగా 2016 చివరిలో వెల్ కమ్ టు సెంట్రల్ జైలు అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు దిలీప్ జైలుకు వెళ్లడంతో కొందరు యువకులు వెల్ కమ్ టు సెంట్రల్ జైల్ అంటు నినాదాలు చేశారు. అయితే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని హీరో దిలీప్ అంటున్నారు.
బుర్కా వేసుకుని కోర్టులో లొంగిపోయిన రాఖీ సావంత్: దెబ్బకు దెయ్యం దిగింది, అయ్యా !
అనవసరంగా నన్ను నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఇరికించారని దిలీప్ ఆరోపించారు. దిలీప్ బెయిల్ కోసం తాము కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరపు న్యాయవాది రామ్ కుమార్ అంటున్నారు. ఈ కేసులో దాదాపు 20 సాక్షాలు సేకరించామని, దిలీప్ ను 13 గంటల పాటు విచారించిన తరువాతే అరెస్టు చేశామని కేరళ పోలీసులు అంటున్నారు.