మలయాళ కవి, గేయ రచయిత అనిల్ హఠాన్మారణం.. గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ మలయాళ కవి, గేయ రచయిత అనిల్ పనచూరన్ మృతిచెందారు. కరోనా వైరస్ చికిత్స తీసుకుంటూ చనిపోయారు. కేరళలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయనకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. అయితే అతని మృతిపై భార్య మాయా అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయాలని కోరడంతో.. సోమవారం పంచనామా చేసిన తర్వాత దహన సంస్కరాలు చేశారు.
కరోనా వైరస్ సోకిన పూనచూరన్ కోల్లాం జిల్లాలో గల ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆదివారం తిరువనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే రాత్రి 7.20 నుంచి రాత్రి 8.30 మధ్య ఆయన చనిపోయారు. పూనచూరన్ రాసిన గేయాలు హిట్ సాంగ్స్గా నిలిచాయి. 'ఎంట్మ్మెదె జిమిక్కీ కమల్' మళయాళీలను ఎక్కువగా ఆకట్టుకుంది.

అలప్పుజా జిల్లా కయంకులాం జిల్లాకు చెందిన ఆయన.. మళయాళ ఇండస్ట్రీలో తనకంటూ మంచిపేరును సంపాదించుకున్నారు. అరాబికద, కదా పరయుబొల్, వెలిపడింతే పుస్తకం సినిమాలకు రాసిన గేయాలు హిట్ టాక్ సంపాదించాయి.