వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బోస్‌కు అండగా, గాంధీ తమిళం నేర్చుకోవాలని ఆశించారు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలు దేశాల్లో భారతి సంతతి ప్రజలు విశేషంగా రాణిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం కౌలాలంపూర్‌లోని ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయత తనకు చిరకాలం గుర్తుండి పోతుందన్నారు. మలేషియా ప్రజలు గాంధీ స్మారకాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. భారత అభివృద్ధిలో తమిళుల పాత్ర మరువలేదన్నారు.

Malaysia Lives Up to Being 'Truly Asia', Says PM Modi in Kuala Lumpur

మహాత్మా గాంధీ కూడా తమిళం నేర్చుకోవాలని ఆశించారని పేర్కొన్నారు. స్నేహం ఎప్పుడూ హృదయాంతరాల్లోంచి వచ్చే చిరునవ్వులా ఉండాలన్నారు. మహాత్మా గాంధీ జీవన విధానం నుంచి మలేషియా ప్రజలు స్పూర్తి పొందారన్నారు. మలేషియాను మహాత్ముడు సందర్శించినప్పటి నుంచి ఇక్కడి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారన్నారు.

అజాద్ హిందు ఫౌజ్‌లో చేరి సుభాష్ చంద్రబోస్ వెన్నంటే మలేషియా ప్రజలు నడిచారన్నారు. భారత సాంస్కృతిక కేంద్రానికి సుబాష్ చంద్రబోస్ పేరునున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోడీ వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రసంగ కార్యక్రమానికి సుమారు 20 వేల మందికి పైగా హాజరయ్యారు.

English summary
As I stand before you I'm reminded of the words of great Tamil saint Thiruvalluvar. Friendship is not just a smile on the face. It is what is felt deep within a smiling heart.Mahatma Gandhi once said he want to learn Tamil to study more about Thiruvalluvar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X