వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు మాల్దీవుల్లో ఎమర్జెన్సీ ఎత్తివేత

|
Google Oneindia TeluguNews

మాలే: ఎట్టకేలకు మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు. గత 45 రోజులుగా దేశంలో కొనసాగుతున్న అత్యయిక స్థితిని తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు అబ్దుల్లా‌ యమీన్‌ వెల్లడించారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా బలగాల సూచనల మేరకు ఎమర్జెన్సీని తొలగించినట్లు యమీన్‌ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.

తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసేందుకు యమీన్‌ నిరాకరించడంతో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీలను తిరిగి పదవుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యమీన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

Maldives president lifts 45-day state of emergency

తీర్పును అమలు చేసేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి, సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నెలకొంది. దీంతో యమీన్‌ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమర్జెన్సీ సమయంలో మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌, మరో న్యాయమూర్తి అలీ హమీద్‌తో పాటు నలుగురు శాసనకర్తలను కూడా అరెస్ట్‌ చేశారు.

English summary
The Maldives has lifted a 45-day state of emergency imposed by President Abdulla Yameen to annul a Supreme Court ruling that had overturned criminal convictions against nine opposition leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X