వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ అయ్యేలా పెరిగిపోతున్న మగ సెక్స్ వర్కర్లు: ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

డబ్బు సంపాదించడానికి సులువైన మార్గమని భావించిన చాలామంది వ్యభిచార వృత్తిని ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకీ వ్యభిచార వృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఈ వృత్తి కొనసాగిస్తున్నవారు ఆడవాళ్లు మాత్రమే అంటే తప్పులో కాలేసినట్టే. వ్యభిచార వృత్తిని జీవనాధారంగా చేసుకుని పనిచేస్తున్న మగ సెక్స్ వర్కర్ల సంఖ్య రోజు రోజుకి ఆందోళనకరంగా పెరుగుతుంది.

వ్యభిచార దందాలో స్త్రీలతో పురుషుల పోటీ

వ్యభిచార దందాలో స్త్రీలతో పురుషుల పోటీ

ప్రస్తుత సమాజంలో సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇప్పుడు చాలా మంది యువత అసాంఘిక కార్యకలాపాలవైపు తమ దృష్టి పెట్టారు. వ్యభిచార దందాలో స్త్రీలతో పురుషులు పోటీ పడుతున్నారు.ఇక వ్యభిచారం చేయటం ఏమాత్రం తప్పు కాదని మగవారు సైతం ఫీలవుతున్నారు. అందుకే దీంతో ఏటేటా మగసెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక భారతదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం ఆందోళన కలిగించే విధంగా మగ సెక్స్ వర్కర్లు పెరిగారని తాజాగా చేసిన ఒక సర్వే వెల్లడించింది. ఆ సర్వే నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలో ఆడ సెక్స్ వర్కర్లతో పాటు, మగ సెక్స్ వర్కర్లు 80% ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

కేరళ రాష్ట్రంలో ఆ సర్వేలో ఆసక్తికర అంశాలు

కేరళ రాష్ట్రంలో ఆ సర్వేలో ఆసక్తికర అంశాలు

తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన సర్వేలో సెక్స్ వర్కర్ల వివరాలను పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్లు ఎంతమంది? అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు? పురుషులు ఎంత మంది ఉన్నారు? వారిలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారు ఎంతమంది ఉన్నారు? అన్నదానిపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సర్వే నిర్వహించింది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఇప్పుడు కేరళలో 17వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా, 13,331 మంది మగ సెక్స్ వర్కర్లు ఉన్నారు.

విపరీతంగా పెరిగిన మగ సెక్స్ వర్కర్లు

విపరీతంగా పెరిగిన మగ సెక్స్ వర్కర్లు

అంతేకాదు ఆ రాష్ట్రానికి వలస వెళుతున్న సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి సిటీలకు వచ్చిన వారు వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిలో 36-46 వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇక వీరు నగరాల్లోని హోటళ్లు, ఫ్లాట్లలో ఉంటూ వ్యభిచార దందా కొనసాగిస్తున్నారని సర్వే ద్వారా తెలిసింది. మరోవైపు ఈ వృత్తిలో కొనసాగి వయసు మీద పడ్డ వారు ఏజెంట్లుగా మారుతున్నారని ఆ సర్వే పేర్కొంది.

డ్రగ్స్ కు అలవాటు , ఇతర రాష్ట్రాల నుండి కేరళకు వలసలు

డ్రగ్స్ కు అలవాటు , ఇతర రాష్ట్రాల నుండి కేరళకు వలసలు

ఇక బెంగాల్ నుంచి చాలా మంది సెక్స్ వర్కర్లు ఏజెంట్ల ద్వారా కేరళకు వస్తున్నారని తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి వచ్చిన మహిళా సెక్స్ వర్కర్లు వారి బంధువులను కూడా తీసుకొస్తున్నారని సర్వే నివేదికలో తేలింది. అలాగే మగ సెక్స్ వర్కర్లు ఎక్కువగా కేరళలోని కోళికోడ్ జిల్లా నుంచి వస్తున్నారని సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ విధంగా ఈజీ మనీ కోసం వ్యభిచార రొంపిలోకి దిగిన మగ సెక్స్ వర్కర్లలో 10వేల మందికి పైగా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని నివేదిక వెల్లడించింది.

ప్రమాదకరంగా మగ సెక్స్ వర్కర్ల సంఖ్య

ప్రమాదకరంగా మగ సెక్స్ వర్కర్ల సంఖ్య

అత్యంత ప్రమాదకరంగా కేరళలో మగ సెక్స్ వర్కర్ల సంఖ్య పెరిగిందని ఇక వీరిలో దాదాపు 15మందికి హెచ్‌ఐవీ కూడా ఉందని సర్వే నివేదిక తేల్చేసింది. ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే కాదు మెట్రో నగరాల్లో చాలావరకు మగ సెక్స్ వర్కర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక వీరు వ్యభిచారం సాగించడం కోసం అన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితులు మారకుంటే భవిష్యత్తులో చాలా ఇది తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

English summary
A Kerala State Aids Control Society (KSACS) survey has sent shockwaves through this once conservative state by releasing data on the number of male and female sex workers. There are 17,000 female and 13,331 male sex workers. The number of migrant sex workers is also increasing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X