హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదాస్పద పోస్టర్: మల్లికా షెరావత్‌కు హైకోర్టు నోటీసు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: త్వరలో విడుదల కానున్న ‘డర్టీ పాలిటిక్స్' సినిమా పోస్టర్‌ను వివాదంలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, నిర్మాత కెసి బొకాడియాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ, ఏపి ఉమ్మ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

Mallika Sherawat Gets Court Notice Over Wearing Tricolor in Film Poster

‘డర్టీ పాలిటిక్స్' సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టరుగా విడుదల చేసిన ప్రకటనలో దుస్తులు లేకుండా.. జాతీయ జెండాను పోలిన మూడు రంగుల వస్త్రాన్ని మల్లికా షెరావత్ తన శరీరంపై కప్పుకుని ఉంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి. ధనగోపాల్ రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్/పార్టీ ఇన్ పర్సన్ వాదనలు వినిపిస్తూ.. అసభ్యకరంగా ఉన్న పోస్టర్‌ను వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

English summary
The Hyderabad High Court has issued notices to Mallika Sherawat and the Centre on a petition against a poster of a film that shows the Bollywood actress draped in the three colours of the national flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X