వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వరాలు: పశ్చిమబెంగాల్‌లోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితమే: మమతా బెనర్జీ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలకు కరోనావైరస్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రాసిన లేఖలో సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కూడా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కాగా, భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశం చేపడుతోందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ మొదటగా మూడు కోట్ల ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

 Mamata Banerjee announces free COVID vaccine for West Bengal

ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని మోడీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. త్వరలో జరగనున్న పండగలు లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాగ్ బిహూ లాంటి దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాక్సిన్ పండగల తర్వాత అంటే జనవరి 16న ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

హెల్త్‌కేర్ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్ల తర్వాత 50 ఏళ్ల లోపు 50 ఏళ్లకు మించిన వారికి ప్రాధాన్యతగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇతర వ్యాధులతోపాటు కరోనాతో బాధపడుతున్నారికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరంతా 27 కోట్ల మంది వరకు ఉంటారని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. 50 ఏళ్ల వయస్సువారిని గుర్తించే పనిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుండగాలని సూచించింది.

English summary
Mamata Banerjee announces free COVID vaccine for West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X