వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ల బీజేపీ మౌత్‌పీస్‌లా.. కోషియారి, ధాన్‌కర్ అతిపై దీదీ గుస్సా, సమాంతర ప్రభుత్వాలా..?

|
Google Oneindia TeluguNews

రాజ్యాంగబద్ద పదవీలో ఉంటూ అధికార పార్టీలకు మౌత్ పీస్‌గా వ్యవహరించడం సరికాదని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కొందరు గవర్నర్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఇది సరికాదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి, కోల్‌కతా గవర్నర్ ధాన్‌కర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

దీదీ ఫైర్

దీదీ ఫైర్

మహారాష్ట్ర గవర్నర్ కోషియారి రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిపాలన విధించింది. ప్రధాన పార్టీలకు అవకాశం ఇవ్వకుండానే కోషియారి వ్యవహరించారని దీదీ విమర్శించారు. రాజ్యాంగబద్ద పదవీలో ఉన్న కోషియారి.. బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గవర్నర్ కూడా..

గవర్నర్ కూడా..

ఇటీవల బెంగాల్‌పై బుల్ బుల్ తుపాన్ ప్రభావం చూపింది. తుపాన్ ప్రభావంపై సీఎం, ఉన్నతాధికారులు సమీక్షించారు. అయితే గవర్నర్ ధాన్‌కర్ కూడా పర్యటిస్తాననడం వివాదానికి కారణమైంది. రాజ్యాంగబద్ద పదవీలో ఉండి.. తన పనులు చేసుకోవాలే తప్ప.. ప్రభుత్వ పనులు చేయడం ఏంటీ అని మమతా ప్రశ్నించారు. బెంగాల్‌తోపాటు మహారాష్ట్రలో కూడా గవర్నర్లు ముఖ్యమంత్రులతో సహా గవర్నర్లు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దీదీ విమర్శించారు. రాజ్యాంగ పదవీలో నామినేట్అయిన వారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలే తప్ప.. ప్రజలతో మమేకం అవడం ఏంటీ అని దీదీ ఫైరయ్యారు.

కామెంట్స్ చేయను.. కానీ...

కామెంట్స్ చేయను.. కానీ...

వాస్తవానికి రాజ్యాగబద్ద పదవీలో ఉన్నవారిపై తాను కామెంట్స్ చేయనని మమతా బెనర్జీ గుర్తుచేశారు. కానీ వారు బీజేపీ మౌత్ పీస్ మాదిరిగా వ్యవహరించడంతో మాట్లాడాల్సి వస్తుందని వివరించారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధి మేరకు నడుచుకోవాలని దీదీ గుర్తుచేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు పాలిస్తారని చెప్పారు. కానీ ఇక్కడ గవర్నర్లు బీజేపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరించడం చర్చకు దారితీసిందని ఆమె చెప్పారు.

మచ్చ తీసుకొస్తున్నారు...

మచ్చ తీసుకొస్తున్నారు...

బుల్ బుల్ తుపాన్ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టిందని మమతా వివరించారు. కానీ గవర్నర్ తాను పర్యటించాలనుకున్నానని చెప్పి.. పదవీకి చెడ్డ పేరు తీసుకొచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. గవర్నర్లు తమ పరిధి మీరి ప్రవర్తిస్తూ.. నీచ రాజకీయాలకు తెరతీయడం మంచి పద్ధతి కాదన్నారు.

English summary
some people in constitutional posts are acting like BJP mouthpieces bengal cm Mamata Banerjee alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X