మ్యూజికల్ ఫెస్ట్ లో స్టెప్పులేసిన మమతాబెనర్జీ .. ఆపై బెంగాల్ పై ఉద్వేగంగా ప్రసంగం, బీజేపీ కి వార్నింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అంతేకాదు మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి స్టెప్పేశారు . పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపితో తన తీవ్రమైన పోరాటం సాగిస్తూనే, ఆమె పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ కార్యక్రమంలో సంగీతకారులు, గాయకులు మరియు నృత్యకారులతో సహా పలువురు జానపద కళాకారులను సత్కరించారు. ఆపై బీజేపీపై నిప్పులు చెరిగారు .

మ్యూజికల్ ఫెస్టివల్ లో పాల్గొన్న బెంగాల్ సీఎం .. కళాకారులతో కలిసి డ్యాన్స్
ప్రఖ్యాత సంతాల్ నర్తకి బసంతి హేమ్ బ్రమ్ను ముఖ్యమంత్రి సత్కరించడంతో పాటు, తనకు కూడా కొన్ని స్టెప్పులు నేర్పించాలని అడిగిమరీ నేర్చుకున్నారు. ఆమె నుండి కొన్ని భంగిమలను అడిగి తెలుసుకుని ఆమెతో కలిసి కాలు కదిపారు మమతాబెనర్జీ. తన డాన్స్ తో అందరినీ అలరించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, బిజీ షెడ్యూల్లో కూడా ఆమె ఒక మ్యూజికల్ ఫెస్టివల్లో పాల్గొనడం, అక్కడి కళాకారులతో కలిసి స్టెప్పులేయడం అందరిని ఆకట్టుకుంది.

పశ్చిమ బెంగాల్ బెంగాల్ నుండే జాతీయ గీతం , జై హింద్ నినాదం
ఆ తర్వాత బిజెపిని టార్గెట్ చేసి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె చేసిన ప్రసంగం లో పశ్చిమబెంగాల్ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ లో గుజరాత్ లాగా మార్చడానికి ఎప్పటికీ అనుమతించమని, పశ్చిమ బెంగాల్లో గుజరాత్ అభివృద్ధి నమూనాను వర్తింప చేయాలని బిజెపి పదేపదే చేసే వాదనను మమతా బెనర్జీ తోసిపుచ్చారు. ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం బెంగాల్ కు సెల్యూట్ చేసే రోజు వస్తుందని అన్నారు .

బెంగాల్ ను గుజరాత్ లా మార్చటానికి అనుమతించం ..
జాతీయ గీతం , జై హింద్ నినాదం అన్నీ పశ్చిమ బెంగాల్ బెంగాల్ ప్రపంచానికి ఇచ్చిందని మమతాబెనర్జీ పేర్కొన్నారు
. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మాకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జై హింద్ ఇచ్చారు, బకిం చంద్ర చటర్జీ వందే మాతరం మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన ప్రపంచానికి అందించారని గుర్తు చేశారు. ఇవన్నీ బెంగాల్ నేల నుండి వచ్చాయన్నారు మమతా బెనర్జీ. బెంగాల్ ను అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నం చేయడం కోసం ఎవరెంత ప్రయత్నాలు చేసినా , ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం బెంగాల్‌కు నమస్కరిస్తుందన్నారు.

బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బెంగాల్ సీఎం
నోబెల్ బహుమతి నుండి ప్రఖ్యాతి గాంచిన ఎన్నో పురస్కారాలు బెంగాల్ నుండే అంటూ బెంగాల్ గొప్పతనాన్ని ఉద్వేగంగా మాట్లాడారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చడానికి మేము అనుమతించమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
బీజేపీ వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే పశ్చిమ బెంగాల్ ను గుజరాత్ మోడల్ లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఆ వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు .