• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మమతా బెనర్జీ అనూహ్య ఎత్తుగడ -టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక - బెంగాల్‌కు కొత్త సీఎం?

|

దేశంలోనే శక్తిమంతమైన ద్వయం మోదీ-షాను ఢీకొట్టి.. ఢిల్లీ పీఠంపై కన్నేసిన దీదీ మరో అసాధారణ ఎత్తుగడను సిద్ధం చేశారు. కరోనా విలయం తర్వాత మోదీ-బీజేపీ గ్రాఫ్ దారుణంగా దెబ్బతిన్న దరిమిలా 2024లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వ రేసులో ముందున్న మమతా బెనర్జీ ఇక ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. పశ్చిమ బెంగాల్ కు కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారా? అనే అనుమానాలకూ తావిచ్చేలా శుక్రవారం నాటి పరిణామాలు జరిగాయిలా...

  Pegasus: Mamata Banerjee VS PM Modi - 'Khela Hobe' | 2024 General Elections | Oneindia Telugu

  షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూషాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

  పార్లమెంటరీ పార్టీ సారధిగా దీదీ

  పార్లమెంటరీ పార్టీ సారధిగా దీదీ

  తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ చీఫ్ మమత బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ పార్టీ ఎంపీలంతా మమత బెనర్జీని ఏకగ్రీవంగా పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు టీఎంపీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మీడియాకు తెలిపారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీకి ఆమె సుదీర్ఘ కాలంగా మార్గదర్శనం చేస్తున్నారని, ఇప్పుడా పనిని అధికారికం చేస్తూ, దీదీని సారధిగా ఎన్నుకున్నామని ఆయన చెప్పారు.

  జగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10th‌కూ మార్కులుజగన్ మరో సంచలనం: ఏపీలో నూతన విద్యా విధానం -ఆగస్టు16న స్కూళ్ల రీఓపెన్ -గత రెండేళ్ల 10th‌కూ మార్కులు

  ఇక ఢిల్లీలో మమత చక్రం..

  ఇక ఢిల్లీలో మమత చక్రం..

  ఏడుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా పని చేసిన మమతకు టీఎంసీ పార్లమెంటరీ పార్టీకి మార్గదర్శనం చేసే దార్శనికత కచ్చితంగా ఉందని, ఆమెకు అనుభవం, బుద్ధి సూక్ష్మత దేశానికి మేలు చేస్తాయని, తాము ఈ నిర్ణయాన్ని సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా తీసుకున్నామని, దీదీ అన్ని వేళలా ఓ ఫోన్ కాల్ దూరంలో ఉంటారని, తమకు మరింత సాధికారత వచ్చిందని భావిస్తున్నామని డెరిక్ ఒబ్రెయిన్ వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇకపై మమత ఢిల్లీ నుంచి చక్రం తిప్పబోతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఇవాళ్టి ఎన్నిక కీలకంగా మారింది.

  బెంగాల్‌కు కొత్త సీఎం తప్పదా?

  బెంగాల్‌కు కొత్త సీఎం తప్పదా?

  తన ఢిల్లీ పర్యటనకు సరిగ్గా ఐదు రోజుల ముందే మమతా బెనర్జీ టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సారధిగా ఎన్నిక కావడం గమనార్హం. ఈనెల 28న ప్రధాని మోదీని కలుసుకోనున్న దీదీ.. విపక్ష పార్టీల నేతలను కూడా కలవనున్నారు. వైసీపీ, టీఆర్ఎస్ తప్ప మిగతా బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నీ మమత నాయకత్వాన్ని సమర్థిస్తున్న క్రమంలో ఆమె ఢిల్లీ పర్యటనపై అంచనాలు పెరిగాయి. మరో నాలుగు నెలల్లో మమత ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉండగా, ఫోకస్ మొత్తాన్ని ఢిల్లీకి తిప్పడం, మోదీని గద్దెదించేలా ఢిల్లీలో ఖేలా హోబే నినాదమిస్తానని చెప్పడం అనూహ్య ఎత్తుగడలుగా పరిణమించాయి. దీదీ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమైపోయే పక్షంలో పశ్చిమ బెంగాల్ కు కొత్త ముఖ్యమంత్రి వస్తారని, దీదీ అల్లుడు అభిషేక్ బెనర్జీకే ఆ పదవి దక్కొచ్చని చర్చ నడుస్తోంది..

  English summary
  West Bengal Chief Minister Mamata Banerjee was on Friday unanimously chosen as the chairperson of the TMC Parliamentary party, setting the stage for her enhanced national profile and an opportunity to interact with top opposition leaders ahead of the 2024 Lok Sabha polls.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X