వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్సార్ తరహాలో..మమతా సింగిల్ షాట్: 291 మంది అభ్యర్థుల లిస్ట్: క్రికెటర్, సినీ స్టార్స్

|
Google Oneindia TeluguNews

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఒకేసారి 291 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ.. తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. అత్యంత సమస్యాతకంగా భావించే నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నారు. రెండు నెలల కిందటే టీఎంసీకి గుడ్‌బై చెప్పి.. భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్న రవాణాశాఖ మాజీమంత్రి సువేందు అధికారిని ఆమె ఢీ కొట్టబోతోన్నారు.

 సింగిల్ షాట్‌ లిస్ట్..

సింగిల్ షాట్‌ లిస్ట్..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 294. ఇందులో మూడుచోట్ల తాము అభ్యర్థులను దింపట్లేదని మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ మూడు పోనూ.. 291 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, వారి నియోజకవర్గాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఒకేసారి 291 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆమె దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చినట్టయింది. ఇదివరకు 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

50 మంది మహిళలకు ఛాన్స్..

50 మంది మహిళలకు ఛాన్స్..

పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి మమతా బెనర్జీ పక్కా వ్యూహాలను రూపొందించుకుంటోన్నారు. ఇందులో భాగంగా.. మహిళలకు ఆమె అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 291 మంది అభ్యర్థుల జాబితాలో 50 మంది మహిళలకు చోటు కల్పించారు. వారికి టికెట్లను ఇవ్వనున్నారు. 42 మంది ముస్లిం అభ్యర్థులను బరిలో దింపారు. షెడ్యూల్డ్ కులాల నుంచి 79, షెడ్యూల్డ్ తెగల నుంచి 17 మందికి టికెట్లను ఇస్తామని తెలిపారు.

80 సంవత్సరాలు దాటిన వారికి నో ఛాన్స్..

80 సంవత్సరాలు దాటిన వారికి నో ఛాన్స్..


80 సంవత్సరాలకు పైనున్న వయస్సున్న వారెవరికీ టికెట్లు ఇవ్వలేదు మమతా బెనర్జీ. అలాంటి నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను బరిలో దింపారు. యువతరాన్ని ప్రోత్సహించారు. ఇటీవలే తృణమూల కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొన్న క్రికెటర్ మనోజ్ తివారీకి టికెట్ లభించనుంది. శివ్‌పూర్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. అలాగే- ఫిల్మ్ స్టార్లు సయంతిక బాంకురా నుంచి కంచన్ మలిక్ ఉత్తరపాడా నుంచి ఎన్నికల బరిలో దిగారు. మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఆమె తన స్థానాన్ని మార్చుకున్నారు.

సువేందు అధికారితో ఢీ..

సువేందు అధికారితో ఢీ..

టీఎంసీలో నంబర్ టూ నేతగా గుర్తింపు పొందిన సువేందు అధికారి.. చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ కేబినెట్‌లో రవాణా మంత్రిగా పనిచేసిన ఆయన మమతా బెనర్జీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరారు. ఇదివరకు సువేందు.. నందిగ్రామ్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయన అదే స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఈ పరిణామాలతో ఆమె నేరుగా సువేందును ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే తన సొంత నియోజకవర్గం భవానిపురాను వీడి.. నందిగ్రామ్‌ నుంచి బరిలో నిల్చోన్నారు. భవానీపురా సీటును సోబన్ దేవ్ ఛటర్జీకి కేటాయించారు.

English summary
West Bengal Chief Minister and Trinamool Congress Chief Mamata Banerjee announced 291 names of candidates for the 2021 Bengal elections and once again confirmed that she will be contesting the election from Nandigram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X