వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమన్లు అందుకున్న సీపీకి అండగా మమత ధర్నా, తమను పోలీసులు అరెస్ట్ చేయడంపై సుప్రీంకు సీబీఐ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు.. ఏకంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సదరు సీబీఐ జాయింట్ డైరెక్టర్ తనకు ప్రాణభయం ఉందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ, లెఫ్ట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం.

రోజ్ వ్యాలీ, శారదా స్కాం కేసులను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు మాయమయ్యాయి. దీంతో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా హఠాత్తుగా కనిపించకుండా పోయారు. అయితే బెంగాల్ పోలీసులు మాత్రం ఆయన ఒక్కరోజే సెలవులో ఉన్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఆదివారం సీబీఐ అధికారులు కోల్‌కతా సీపీ ఇంటికి వెళ్లగా.. ఆయనను కాపాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ డీజీపీ, కోల్‌కతా మేయర్ తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

Mamata Banerjee dharna at Metro Channel, CBI to move SC against detention by WB police

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు. బీజేపీ తమను వేధిస్తోందని మండిపడ్డారు. కేవలం బ్రిగేడ్ ర్యాలీ కోసం తమను నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. (బీజేపీ ర్యాలీలకు మమతా బెనర్జీ అనుమతులు నిరాకరిస్తూ వస్తోంది.) నిన్న ప్రధానిని తనకు హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. ప్రపంచంలోని అధికారుల్లో రాజీవ్ కుమార్ బెస్ట్ అని ఆమె వెనుకేసుకొచ్చారు. నోటీసులు లేకుండా కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఇంటికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. తాను తమ అధికారులకు అండగా ఉంటానని చెప్పారు.

తాను ఫెడరల్ స్ట్రక్చర్‌ను కాపాడేందుకు ధర్నా చేయబోతున్నానని మమత చెప్పారు. ఈ రోజు నుంచి తాను మెట్రో ఛానల్ వద్ద కూర్చుంటానని చెప్పారు. తాము సత్యాగ్రహం చేయబోతున్నామన్నారు. అనంతరం ఆమె కోల్‌కతా మెట్రో ఛానల్ వద్ద 'సేవ్ ది కాన్‌స్టిట్యూషన్' పేరుతో ధర్నాకు దిగారు. ఆమెతో పాటు సమన్లు అందుకున్న రాజీవ్ కుమార్ కూడా ఉండటం గమనార్హం.

బెంగాల్ పోలీసులు ఐదుగురు సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకోవడం సంచలనమే. వారిని కోల్‌కతాలోని షేక్స్‌పియర్ సరానీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సీబీఐ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టిన నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ (సీఆర్పీఎఫ్) రంగంలోకి దిగింది. కోల్‌కతాలోని సీజీవో కాంప్లెక్స్.. సీబీఐ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీబీఐ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు వారిని రాత్రి వదిలేశారు.

కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని మధ్యంతర సీబీఐ చీఫ్ నాగేశ్వర రావు చెప్పారు. రోజ్ వ్యాలీ, శారద చిట్ ఫండ్ కుంభకోణంలో ఆధారాలను నాశనం చేసిన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. చిట్ ఫండ్ కేసును సుప్రీం కోర్టు డైరెక్షన్‌లో విచారిస్తున్నామని చెప్పారు. అంతకుముందు బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపిందని, ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలు వారు సీజ్ చేశారని, కానీ వారి వద్ద ఉన్న ఆధారాలతో తమకు విచారణకు సహకరించడం లేదని చెప్పారు. వారు ఆధారాలు తమకు కనిపించకుండా చేయడం లేదా ఆధారాలు లేకుండా చేస్తున్నారన్నారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee sitting on her 'Save the Constitution' dharna at Metro Channel, Kolkata. Kolkata Police Commissioner Rajeev Kumar is also present. Cbi to move to SC tomorrow against detention by wb police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X