వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి అవమానించారు: గవర్నర్ ఫైర్.. కనీస గౌరవం ఇవ్వారా? అంటూ

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్ మరియు కేంద్రం మధ్యలో ఇప్పటికే వివాదాలు నెలకోన్న విషయం తెలిసిందే... ఆ వివాదానికి రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. రాష్ట్రంలోని నిర్వహించిన దుర్గాపూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను అవమానించారని గవర్నర్ జగదీప్ దంఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పూజా కార్యక్రమ వేడుకల్లో తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మీడియా కూడ ఈ విషయాన్ని పసిగట్టలేదని చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్లపై కనీసం 20 సెకన్లు కూడ చూపించలేదని చెప్పారు.

ఆక్టోబర్ 11న పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రభుత్వం దుర్గాపూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు గవర్నర్ జగదీప్ దంఖర్‌ కూడ పాల్గోన్నారు. అయితే సుమారు నాలుగు గంటలపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గోన్నా, ఆయన ప్రస్థావన మాత్రం ముఖ్యమంత్రి తీసుకురాలేదు. దీంతో ఆయన తనకు కేటాయించిన స్థానంలో అలాగే కూర్చిండిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాష్ట్ర మొదటి పౌరుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదంటూ చెప్పారు.

Mamata Banerjee insulted, Bengal Governor said

అయితే ప్రభుత్వం పూజా కార్యక్రమాన్ని ఘనంగా జరపడాన్ని అభినందించిన గవర్నర్ వేదికపై వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. వేదికపై తనకు చివరి వరుసలో స్థానాన్ని కేటాయించి, ముఖ్యమంత్రి తీవ్రంగా అవమానించారని అన్నారు. ప్రభుత్వ చర్యతో మనస్థాపానికి గురయ్యాయని చెప్పారు. తనను అవమానించడం ద్వార బెంగాల్ ప్రజలను కూడ అవమానించారని అన్నారు. రాజ్యంగబద్దంగా ఎన్నికైన తనకు జరిగిన అవమానంపై ప్రభుత్వం ఆత్మపరీశీలన చేసుకుంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. పూజ కోసం మొత్తం 70 పండాల్స్ వేశారు. కాని ప్రధాన వేదికపై గవర్నర్‌ను కూర్చునేందుకు అవకాశం ఇవ్వలేదని ఆన్నారు.

English summary
West Bengal Governor Jagdeep Dhankar said he was insulted at an event hosted by chief minister Mamata Banerjee in Kolkata on October 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X