• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ, ఈసీపై గుస్సా : బాబ్రీ కూల్చివేత కన్నా దారుణ పరిస్థితి ఉందా ? ప్రచారం ఆపివేయడంపై మమత

|

కోల్ కతా : బెంగాల్‌లో అమిత్ షా ర్యాలీతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే ప్రచారం నిలిపివేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసీ నిర్ణయంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఫైరయ్యారు. ఇటు బీజేపీపై విమర్శలు గుప్పించారు.

బాబ్రీ కూల్చివేత కన్నానా ?

బాబ్రీ కూల్చివేత కన్నానా ?

బెంగాల్ హింసను బీజేపీ పెద్దది చేసి చూపిందని మండిపడ్డారు దీదీ. లేనిది ఉన్నట్టు చూపిందని ఫైరయ్యారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత చెలరేగిన హింస కన్నా బెంగాల్‌లో సిచుయేషన్ ఉందా అని ప్రశ్నించారు. మంగళవారం కోల్ కతాలో బీజేపీ గుండాలు చేసిన దాష్టీకం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉన్నదని .. స్పష్టంచేశారు.

శాంతిమంత్రమే

శాంతిమంత్రమే

కాలేజీలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ గుండాలు కూల్చివేశారని ఆరోపించారు దీదీ. కానీ రాష్ట్రంలో పరిశోధ విద్యార్థులు, ఇతరులు ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు. విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేసిన నిగ్రహాంతో ఉన్నారే తప్ప ఎక్కడ అవాంఛనీయ ఘటనలకు పాల్పడలేది పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగాల్ లో శాంతి భద్రతలు పరిస్థితి బాగానే ఉందని వివరించారు. కానీ ఎన్నికల సంఘం దాదాపు 36 గంటల ముందే ప్రచారం నిలిపివేయడం సరికాదన్నారు.

కలలో కూడా ...

కలలో కూడా ...

'బెంగాల్ .. కశ్మీర్, బీహార్, త్రిపుర యూపీ కాదని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుంచుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్ ... బంగ్లా, దీనిని మీ చేతిలోకి ఎన్నిటికీ తీసుకోలేవన్నారు. అంతేకాదు గురువారం ప్రచారం నిలిపివేయడంలో బీజేపీ ప్రమేయం ఉన్నదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థల ఆదేశాలు మోదీ, అమిత్ షా నుంచే వెళతాయన్నారు. వాస్తవానికి బెంగాల్ లో శాంతి భద్రతల పరిస్థితి ఉంటే .. నిషేధం విధించినా ఓకే అన్నారు. అదే కాదు రాష్ట్రంలో మోదీ ర్యాలీలు పూర్తయ్యాయని అందుకే ... ప్రచారాన్ని పరిసమాప్తం చేశారని ఆరోపించారు. మోదీ ప్రచారం అయిపోతే .. మిగతా నేతల సంగతేంటని ప్రశ్నించారు.

ఇదేం పద్ధతి

ఇదేం పద్ధతి

దేశంలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మా మొరను అలకించదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా బీజేపీ చెప్పినట్టే చేస్తుందని దుయ్యబట్టారు. దీంతో మేం ఎక్కడికి పోవాలి ? తమ ప్రజలు పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇది బెంగాల్ ప్రజలకు చేసిన అవమానమని .. అందుకే వారికి ఓట్లేయద్దని కోరారు. మీరు బయటకొచ్చి బీజేపీ, ఈసీ విధానాలపై నిరసన తెలియజేయాలని సూచించారు.

English summary
West Bengal Chief Minister and Trinamool Congress chief Mamata Banerjee on Wednesday lashed out at the Election Commission and the Bharatiya Janata Party for cutting short campaign duration in the state. Referring to riots during the BJP President Amit Shah's rally in Kolkata on Tuesday, Mamata Banerjee said that what happened there was worse than the violence that took place in the aftermath of Babri Masjid demolition in 1992. "What happened in Kolkata yesterday, this kind of ruckus didn't even happen after Babri Masjid demolition. Only I know how I kept the situation under control," she said at a press conference in Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X