• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

థాక్రే-దీదీ భేటీ: జైమరాఠా.. జైబంగ్లా- మమతా స్లోగన్స్ వెనక వ్యూహమేంటి..చక్రం తిప్పుతోందా..!!

|
Google Oneindia TeluguNews

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించాలనే యోచనలో ఉన్నారా... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కూడా సమాలోచనలు చేస్తూ దీదీ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇది అటుంచితే.. మమతా బెనర్జీ ఇటు ఢిల్లీ నుంచి అటు ఇతర రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక బీజేపీకి దుష్మన్‌లు ఎవరైతే ఉన్నారో వారినే లక్ష్యంగా చేసుకుని దీదీ పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆమె ముంబైలో ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉండటంతో ఆయన తనయుడు మంత్రి ఆదిత్య థాక్రేను మమతా కలిశారు. దీంతో మమతా పొలిటికల్ స్ట్రాటజీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇక మంగళవారం రోజున మమతా బెనర్జీ మాట్లాడుతూ... శివసేనతో తాము కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో మమతా దేశవ్యాప్తంగా ఫోకస్ చేశారనే సంకేతాలు బయటకు వచ్చాయి. ఇంక ముంబై పర్యటనలో ఉన్న మమతా మంగళవారం రోజున ప్రసిద్ధిగాంచిన సిద్ధివినాయక ఆలయంను సందర్శించారు. ఆ సమయంలో జై మరాఠా.. జై బంగ్లా అంటూ నినదించారు. అయితే మమతా నినాదంపై శివసేన ఒక్కింత సంతోషం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు మహారాష్ట్రలో ఉన్నాయి. దీదీ రాకతో మహారాష్ట్రలో సెటిల్ అయిన బెంగాలీలు శివసేనకు అనుకూలంగా మారుతారనే ఆశ పెట్టుకుంది. అదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన వలసదారులు కూడా శివసేనకు మద్దతు పలుకుతారనే ఆశతో ఉంది.

Mamata Banerjee meets Shivasena leader Aditya Thackeray, Gives Jai Maratha jai Bangla slogan-Here is the strategy

ఇక బెంగాల్ సీఎం మమత బెనర్జీతో భేటీ ముగిశాక ఆదిత్యనాథ్ థాక్రే మాట్లాడారు. శివసేన-టీఎంసీ పార్టీల స్నేహం ఇప్పటిది కాదని ఎప్పటినుంచో ఉందని గుర్తుచేశారు. ఇక భవిష్యత్తులో రెండు పార్టీలు బలోపేతం అవుతాయని చెప్పారు. మమతా బెనర్జీ తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారాలనే ఆలోచన చేస్తున్న క్రమంలో ముంబై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లేని ప్రతిపక్షాన్ని నిర్మించడమే లక్ష్యంగా మమతా పావులు కదుపుతోంది. అక్టోబర్ నెలలో గోవాలో పర్యటించిన మమతా బెనర్జీ అక్కడ రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మహారాష్ట్ర-పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పోరాడే రాష్ట్రాలే కానీ తలదించుకునే రాష్ట్రాలు కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

మహారాష్ట్రలో తనకు లభించిన స్వాగతంపై హర్షం వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇక సిద్ధివినాయక ఆలయంను సందర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్ధవ్ థాక్రే త్వరగా కోలుకోవాలని తాను స్వామివారిని కోరుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఇక చివరిగా జై మరాఠా జై బంగ్లా అని నినదించారు. అంతకుముందు ఆమె షాహీద్ తుకారాం ఓంబ్లే మెమోరియల్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం 26/11 దాడుల్లో వీరమరణం పొందిన పోలీసులకు నివాళులు అర్పించారు.

  Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu

  ఇక తన పర్యటన ముగించుకునేలోగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అవుతారు మమతా బెనర్జీ. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై బెంగాల్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 2022లో బెంగాల్‌లో జరిగే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు వారిని ఆహ్వానిస్తారు. ఇక కొందరు స్థానిక నాయకులతో మమతా భేటీ అవుతారు. ఇదే పర్యటనలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాద్షా షారుఖ్‌ఖాన్‌లను మమతా కలుస్తారని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.

  English summary
  Mamata Banerjee met Shivasena leader and minister Aditya Thackeray and gave slogans Jai Maratha Jai Bangla.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X