వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుఫాను రాజకీయం: మోడి ఫోన్ చేస్తే, మమత బెనర్జీ స్పందించలేదు

|
Google Oneindia TeluguNews

ఫణి తుఫాన్‌ సైతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కోంటుంది. బీభత్సమైన తుఫాన్ నేపథ్యంలో అటు కేంద్రం ఇటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మధ్య పోలిటికల్ వార్ నడుస్తోంది. ఈనేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో తుఫాన్ ప్రభావం వివరాలను తెలసుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడి ఫోన్ చేసినా ఆమే మాత్రం స్పందించలేదని పీఎంవో అధికారులు వెల్లడించారు.

ఫణి తుఫాను నేపథ్యంలో ప్రధాని మోడీపై తృణముల్ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఫణి తుఫాన్ నేపథ్యంలోనే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో మాత్రం తుఫాన్ విషయం చర్చిందేందుకు కనీసం ఫోన్ కూడ చేయలేదని ఆరోపణలు చేసింది. ప్రధాని కార్యాలయం దీనిపై వివరణ ఇచ్చింది. శనివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు సార్లు ఫోన్ చేశారని పీఎంఓ అధికారి వెల్లడించారు.

ఫైర్‌బ్రాండ్‌ను చిర్రెత్తించిన జైశ్రీరామ్ నినాదాలు: కారు దిగి మ‌రీ వార్నింగ్‌ఫైర్‌బ్రాండ్‌ను చిర్రెత్తించిన జైశ్రీరామ్ నినాదాలు: కారు దిగి మ‌రీ వార్నింగ్‌

Mamata Banerjee not responds on PM Modi call , says Centre

అయితే ప్రధాని ఫోన్ చేసిన సమయంలో ఆమే ఇతర కార్యక్రమంలో ఉన్నారని సమాధానం వచ్చిందని తెలిపారు. తిరిగి ప్రధానికి ఫోన్ చేయలేదని తెలిపారు. ఈనేపథ్యంలోనే ఆ గవర్నర్ కేశరి నాథ్ త్రిపాఠి తో ప్రధాని తుఫాన్ ప్రభావంపై చర్చించారని తెలిపారు. మరోవైపు మోడీ తుఫాన్ ప్రభావం పై గవర్నర్ తో మాట్లాడానని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహయం అందించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పడంతోపాటు తుఫాను బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ..ట్విట్టర్ లో ద్వారా తెలిపారు.

English summary
political blame game has started between the Centre and the West Bengal government over Cyclone Fani.Prime Minister Narendra Modi had on Saturday tried to contact West Bengal Chief Minister Mamata Banerjee to discuss cyclone Fani but could not do so as his calls were not returned, a top government official has said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X