• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మమత మొత్తం ఆస్తి రూ.16.72లక్షలు -వాహనాలు లేవు -రచనలపై రూ.930 -బెంగాల్ సీఎం ఎన్నికల అఫిడవిట్

|

జనాభా పరంగా దేశంలోనే నాలుగో అతిపెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌కు గడిచిన 10ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నెన్నో పదవులు చేపట్టారు.. అయితే, 70వ దశకంలో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటిదాకా విధానాలు మార్చుకున్నారేమోగానీ.. సింప్లిసిటీని మాత్రం వదల్లేదు.. ఈ రోజుకూ తన దగ్గర పట్టుమని తులం బంగారమైన లేదని చెప్పుకున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ..

viral video:ఇళ్లలోకి చొరబడి చిరుత బీభత్సం -చిన్నారి సహా ఐదుగురికి గాయాలు -5గంటల హైటెన్షన్viral video:ఇళ్లలోకి చొరబడి చిరుత బీభత్సం -చిన్నారి సహా ఐదుగురికి గాయాలు -5గంటల హైటెన్షన్

 మమత మొత్తం ఆస్తి ఇదే..

మమత మొత్తం ఆస్తి ఇదే..

హోరాహోరీగా సాగుతోన్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈసారి నందిగ్రామ్(పూర్బ మేదినీపూర్ జిల్లా) నుంచి బరిలోకి దిగారు. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా, ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ తాలూకు వివరాలు గురువారం వెల్లడయ్యాయి. ఈసీకి సమర్పించిన సెల్ఫ్ అఫిడవిట్ ప్రకారం మమతా బెనర్జీ మొత్తం ఆస్తి రూ.16.72లక్షలు మాత్రమే. ఇదంతా చరాస్తి రూపంలోనే ఉందని, స్థిరాస్తులేవీ తనకు లేవని ఆమె పేర్కొన్నారు.

 కారు లేదు.. జువెలరీ 9 గ్రాములే..

కారు లేదు.. జువెలరీ 9 గ్రాములే..

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2016లో సమర్పించిన అఫిడవిట్లో మొత్తం ఆస్తిని రూ.30.45లక్షలుగా ప్రకటించారు. అదే 2021 ఎన్నికలకు వచ్చేసిరికి దాదాపు సగం ఆస్తి తరుక్కుపోయి రూ.16.72లక్షలయింది. కారుగానీ ఇతర ఏ వాహనంగానీ తనకు లేవని దీదీ చెప్పుకున్నారు. సింపుల్ కాటన్ చీరలు, స్లిప్పర్లు మాత్రమే ధరించే దీదీ.. తన వద్ద కేవలం తొమ్మిది గ్రాముల ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ.43వేలని పేర్కొన్నారు. ప్రస్తుతం చేతిలో రూ.69,255 రూపాయలు ఉన్నాయని, ఎన్నికల ఖర్చు రూ.1.51లక్షలతోపాటు బ్యాంకులో రూ.13.53 లక్షలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) డిపాజిటల్ రూ.18,490, ఇలా మొత్తం కలిపి రూ.16.72 లక్షల చరాస్తి ఉందన్నారు.

 లాయర్ పట్టా.. కేసులు నిల్..

లాయర్ పట్టా.. కేసులు నిల్..

2019-20 ఆర్థిక సంవత్సరంలో తన సంపాదనను రూ. 10,34,370గా పేర్కొన్నారు. పలు అంశాలపై రచనలు చేసిన ఆమె.. పుస్తకాల అమ్మకపు రాయల్టీగా రూ.930 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. కోల్ కతా యూనివర్సిటీ నుంచి ఎంఏతోపాటు ఎల్ఎల్‌బీ పట్టాను కూడా పొందానన్న మమత.. ప్రస్తుతానికి తనపై క్రిమినల్ కేసులేవీ పెండింగ్ లో లేవని అఫిడవిట్ లో తెలిపారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీదీ బరిలో ఉన్న నందిగ్రామ్ లో ఏప్రిల్ 1న పోలింగ్ జరుగనుంది. బుధవారం నందిగ్రామ్ లో అనుమానిత దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం కోల్ కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్

English summary
Trinamool Congress supremo and West Bengal Chief Minister Mamata Banerjee has declared that her net worth is Rs 16.72 lakh.Banerjee, who is contesting the Nandigram assembly constituency in Purba Medinipur district, doesn't own any vehicle or property, according to her self-sworn affidavit filed before the Election Commission of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X