వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎం మోడీ క్షమాపణ చెప్పాలీ...! పరువు నష్టం నోటీసును పంపిణి చేసిన తృణముల్ ఏంపీ

|
Google Oneindia TeluguNews

ప్రదాని నరేంద్రమోడీకి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరువు నష్టం కేసుకు సంభందించి ప్రధాని నరేంద్రమోడీకి నోటీసులు పంపాడు. దీనికి సంబంధించి 36 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కోన్నారు. కాగా మే15 డైమండ్ హర్బర్‌ లో నిర్వహించిన ర్యాలీలో భాగంగా కామెంట్ చేసిన గణతంత్ర , గుండాతంత్ర అంటూ మమతాబెనర్జీతోపాటు, అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు

Mamata Banerjees Nephew Sends Defamation Notice To PM Modi

ఆదివారం చివరి దశ ఎన్నికలు ఉన్న నేఫథ్యలంలో పశ్చిమ బెంగాల్లో మరో వివాదానికి తెరలేచింది. పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఒక్క రోజు ముందుగానే ప్రచారానికి ఈసీ తెరదించడంతో రెండు రోజులుగా నేత మధ్య ఎలాంటీ ఎదురుదాడీలేదు. అయితే చివరి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ మేనల్లుడు త‌ృణముల్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ మోడీకి పరువు నష్టం నోటీసులు పంపడంతో మరోసారి బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.

కాగా మే15 ప్రధాన మంత్రి మోడీ వెస్ట్ బెంగాల్‌లోని డైమండ్ హర్బర్‌లో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ‌తోపాటు ఆమే మేనల్లుడు త‌ృణముల్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీని ఉద్దేశిస్తూ బువ -భతీజా అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు బెంగాల్ లో గణతంత్రంకాస్త గుండాతంత్రంగా మారిందని వ్యాఖ్యానించారు. అభిషేక్ నుండి ప్రజలు మార్పు కోవడంతోపాటు రాష్ట్ర్రంలో గుండాగిరి కొనసాగుతుందని అభిషేక్ డైమండ్ హర్బన్ స్థలాన్ని ఆక్రమించి తన కార్యాలయాలు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై 36 గంటల్లోగా ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణ చెప్పాలని ఆయన అడ్బకేట్ ద్వార నోటీసులు పంపించారు.

English summary
Mamata Banerjee's Nephew Sends Defamation Notice To PM Modi OverHis 'Emergency Under Bua-Bhatija' Remark At West Bengal's Diamond Harbour Rally
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X