వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖట్టర్ కామెంట్లపై దీదీ గుస్సా : కశ్మీర్ కాదు దేశాన్ని అవమానిస్తున్నారని ఫైర్

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : కశ్మీర్ యువతులపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఓ సీఎం ఇలా కశ్మీరీ యువతులను అవమానించడం ఏంటని మండిపడుతున్నాయి. దీనిపై ఇంటా, బయట విమర్శలు వెల్లువెత్తడంతో అధికార బీజేపీ ఇరుకునపడిపోయింది. ఖట్టర్ వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. కశ్మీరీ యువతుల పట్ల ఖట్టర్ వ్యాఖ్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖట్టర్‌ కామెంట్ల రచ్చ..
జమ్ముకశ్మీర్ విభజన జరిగి దేశంలో మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా హక్కులు సాధించుకొన్న తరుణంలో ఖట్టర్ కామెంట్లు చిచ్చురేపాయి. ఆర్టికల్ 370 రద్దుచేసి, కశ్మీర్‌ను విభజించి కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రప్రభుత్వం చేస్తే ఆ పార్టీ నేత, సీఎం ఇలా వ్యాఖ్యానించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నారు. వాస్తవానికి హర్యానాలో బాలికల జననరేటు పడిపోతుంది. దీంతో వారు బీహరీలను తీసుకొచ్చి పెళ్లిచేసుకునేవారు. ఇప్పుడు కశ్మీర్ కూడా భారత్‌లో పూర్తిగా అంతర్భాగం కావడంతో కశ్మీర్ యువతులను కూడా తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. దీనిని దీదీ తప్పుపట్టారు. కశ్మీర్ యువతల పట్ల ఖట్టర్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇదీ కేవలం జమ్ముకశ్మీర్‌నే కాదు యావత్ దేశాన్ని కించపరచడం, అవమానించడం అని మండిపడ్డారు.

Mamata Banerjee slams Haryana CMs remark on Kashmiri girls

ఇదేనా మీ ట్రైనింగ్ ..
మరోవైపు హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఖండించారు. కశ్మీర్ యువతుల పట్ల ఓ సీఎం వైఖరి సరికాదన్నారు. దేశభక్తులమని చెప్పుకునే ఆరెస్సెస్ .. తమ పార్టీ నేత వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. ఏ మహిళ కూడా పురుషుడి సొంతం కాదని, అలా వ్యాఖ్యానించి బీజేపీ తన విధానాన్ని తెలియజేసిందని ట్వీట్ చేశారు. ఇటీవల యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైని అందమైన కాశ్మీరి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న వేళ ఖట్టర్ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి.

English summary
west Bengal CM Mamata Banerjee on Saturday criticised Haryana CM Manohar Lal Khattar's remark on Kashmiri girls and said that it was wrong to make such comments. Mamata Banerjee said that people holding high public office must restrain from making insensitive comments about the people of Jammu and Kashmir. In a tweet, Mamata Banerjee said, "We, and more so people holding high public office, must restrain ourselves from making insensitive comments about the beloved people of Jammu and Kashmir. These are hurtful, not only for J&K, but the entire nation."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X