• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉక్రెయిన్ లో విద్యార్థులను పట్టించుకోని మోడీ; ఎన్నికల ర్యాలీలో బిజీ: మమతాబెనర్జీ ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను లక్ష్యంగా చేసుకుని టీఎంసీ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారణాసిలో యూపీ ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 'ఖేలా హోగా' జరుగుతుందని యూపీలో బీజేపీ పాలన ముగిసిపోతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

వారణాసిలో మమతకు నల్లజెండాలతో నిరసన సెగ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా.. దీదీ కౌంటర్వారణాసిలో మమతకు నల్లజెండాలతో నిరసన సెగ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా.. దీదీ కౌంటర్

 భారతీయులను ఉక్రెయిన్ నుంచి ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారు

భారతీయులను ఉక్రెయిన్ నుంచి ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారు

ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు గురించి పట్టించుకోవడం లేదని, ఎన్నికల ర్యాలీలో బిజీగా తిరుగుతున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. పుతిన్ తో సత్సంబంధాలున్న మీకు మూడు నెలల ముందే యుద్ధం వస్తుందని తెలిసినా భారతీయులను ఉక్రెయిన్ నుంచి ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారు అంటూ ప్రధాని మోడీని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

బీజేపీ ఓటమి ఖాయం... బెంగాల్ తరహాలో యూపీలో ఓడించండి

బీజేపీ ఓటమి ఖాయం... బెంగాల్ తరహాలో యూపీలో ఓడించండి

వారణాసిలో ర్యాలీని ఉద్దేశించి సమాజ్వాది నేతృత్వంలోని కూటమికి మద్దతుగా, బెనర్జీ ఇలా అన్నారు. గతసారి బెంగాల్లో బిజెపిని ఓడించామని, ఇప్పుడు యూపీ ఎన్నికలలో కూడా బిజెపిని ఓడించాలని, అఖిలేష్ గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పుడు ఎన్నికల్లో, గేమ్ కొనసాగుతోంది. అఖిలేష్ కూటమి గెలుస్తుంది. బిజెపి ఓడిపోతుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను తన తమ్ముడిగా అభివర్ణించిన ఆమె, అఖిలేష్, ఆర్‌ఎల్‌డి అధినేత జయంత్ చౌదరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే యుపి కుమారులు అని అన్నారు.

పేరుకే యోగి కానీ ఆయన భోగి అన్న మమతా బెనర్జీ

పేరుకే యోగి కానీ ఆయన భోగి అన్న మమతా బెనర్జీ

యోగి ఏమి ఇస్తాడు? పేరుకే యోగి, కానీ ఆయన భోగి అన్నారు. ఆయనకు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు. యోగి ప్రభుత్వాన్ని గద్దె దించండి అని పిలుపునిచ్చారు. వారణాసిలోని ఘాట్‌లకు వెళుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు తన కారుపై దాడి చేశారని ఆరోపిస్తూ,వారు అధికారం నుంచి తప్పుకుంటున్నారని తనకు అప్పుడు అర్థమైంది. తాను ఎవరికీ భయపడను అని, తాను పిరికిదాన్ని కాదని, తాను ఒక ఫైటర్ నని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తనపై చాలాసార్లు దాడి జరిగింది కానీ తానెప్పుడూ భయపడలేదన్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే దాడులకు దిగుతారని మండిపడ్డారు మమతా బెనర్జీ.

ఎన్నికలు వస్తేనే దేవాలయాలు, హిందూ ముస్లిం ల గురించి బీజేపీ వ్యాఖ్యలు

ఎన్నికలు వస్తేనే దేవాలయాలు, హిందూ ముస్లిం ల గురించి బీజేపీ వ్యాఖ్యలు


ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడంపై దృష్టి పెట్టే బదులు యూపీలో ఎన్నికల సమావేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు, బిజెపి దేవాలయాల గురించి హిందూ-ముస్లిం గురించి మాట్లాడటం ప్రారంభిస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తధ్యం అన్నారు మమతా బెనర్జీ.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee in Varanasi slams Modi. She alleges that MOdi ignores students in Ukraine but he is Busy in election rallies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X