వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా మీదే ఆరోపణలా ... మోడీ ప్రమాణ స్వికారం హజరుపై మనస్సు మార్చుకున్న దీదీ

|
Google Oneindia TeluguNews

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరవుతానని చెప్పి అందరిని అశ్చర్యంలో ముంచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరోజులోనే మనస్సు మార్చుకున్నారు. తాను మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరుకావడం లేదని తేల్చి చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో జరగిన రాజకీయ ఘర్షణల్లో బీజేపీకి చెందిన 54మంది కార్యకర్తలు మృత్యువాత పడ్డారనే ఆరోపణలకు నిరసనగా ఆమే ప్రమాణాస్వీకారానికి హజరు కావడం లేదు.

మోడీ ప్రమాణాస్వీకారానికి మమతా ప్రత్యేక అహ్వానితురాలు...

మోడీ ప్రమాణాస్వీకారానికి మమతా ప్రత్యేక అహ్వానితురాలు...

మే 30న మోడీ ప్రమాణ స్వీకారానికి బీజేపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తృణముల్ కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆహ్వానం అందింది. దీంతో రాష్ట్ర్రంలో రెండు పార్టీల మధ్య రాజకీయ అంతర్యుద్దం జరుగుతున్నా... రాజ్యంగబద్దంగా జరిగే కార్యక్రమానికి హజరయ్యెందుకు ఆమే సుముఖత వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడ చర్చిస్తున్నట్టు ఆమే ప్రకటించారు.

 ఢిల్లీకి వెళ్లనున్న కోల్‌కతా బీజేపీ కార్యకర్తల కుటుంభాలు

ఢిల్లీకి వెళ్లనున్న కోల్‌కతా బీజేపీ కార్యకర్తల కుటుంభాలు

అయితే ఢిల్లీకి వెళతానని ప్రకటించిన మరుసరి రోజే అమే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే ఇటివల పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తపై కాల్పులు జరగడంతో ఓ కార్యకర్త మృతి చెందాడు. దీంతో ఈ దాడులకు మమతా బెనర్జీ కారణమంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈనేఫథ్యంలోనే గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మొత్తం 54మంది బీజేపీ కార్యకర్తలు రాజకీయ ఘర్షణల్లో మృత్యువాత పడ్డారని వారు ఆరోపణలు చేశారు. దీంతో మృత్యువాత పడిన కార్యకర్తల కుటుంభాలను మోడీ ప్రమాణ స్వీకారానికి కూడ అహ్వనించారు. రాజకీయ ఘర్షణల్లో మృత్యువాత పడిన కుటుంబాలు కూడ ఢిల్లీకి వెళ్లనున్నాయి

పోలిటికల్ వార్‌కు తెరలేపిన మమతా

పోలిటికల్ వార్‌కు తెరలేపిన మమతా

ఈనేపథ్యంలోనే బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను మమతా బెనర్జీ కొట్టి పారేసింది. బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దం అని పేర్కోంది. దీంతో తనపై ఆరోపణలు చేస్తున్నందుకు నిరసనగా ప్రధాని ప్రమాణ స్వీకారానికి కాబోవడం లేదని స్పష్టం చేసింది. దీంతో మరోసారి రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్‌కు తెరలేపినట్టుయింది. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి విదేశాలతోపాటు స్వదేశంలోని ముఖ్యమంత్రులు ఇతర పార్టీ ప్రతినిధులు హజరవుతున్న విషయం తెలిసిందే.

English summary
Mamata Banerjee, after saying she would try to attend Prime Minister Narendra Modi's oath ceremony in Delhi on Thursday as a constitutional duty,but she cleared that she will not attend the oath ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X