వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుస్తోందా?: అదే భయమంటూ మమతా బెనర్జీపై కిషన్ రెడ్డి ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు .

అన్నంత పనిచేస్తున్నారు: ఎన్ఆర్‌పీని నిలిపేస్తూ మమతా సర్కారు ఆదేశాలుఅన్నంత పనిచేస్తున్నారు: ఎన్ఆర్‌పీని నిలిపేస్తూ మమతా సర్కారు ఆదేశాలు

విద్వేష పూరిత రాజకీయాలంటూ కీలక వ్యాఖ్యలు

విద్వేష పూరిత రాజకీయాలంటూ కీలక వ్యాఖ్యలు

సీఏఏకు కసంబంధించి నిబంధనలు, విధి విధానాలు పూర్తిగా ఖరారు కాలేదని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి, అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగాక, దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి కేంద్రం సత్వరమే ఎటువంటి చర్యలు తీసుకోబోదని తెలిపారు.

మమతా భయపడుతున్నారంటూ...

మమతా భయపడుతున్నారంటూ...

ఈ క్రమంలో మమతా బెనర్జీపై కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడటం, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కారణంగా మమతా బయపడిపోతున్నారన్నారు.
అందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుస్తోందా? అంటూ ఆగ్రహం

ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుస్తోందా? అంటూ ఆగ్రహం


అసలు మమతా బెనర్జీ ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుస్తోందా? ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఏ కారణంగా దేశ పౌరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలిగించదని, కాబట్టి ఆందోళనకారులు నిరసన విరమించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించేందుకు, తప్పుదోవ పట్టించేందుకు మతాన్ని వాడుకుంటున్నారా? అంటే ప్రతిపక్షాలు వారికి మద్దతు పలుకుతున్న మేధావులను ప్రశ్నించారు.

 బీజేపీకి సవాల్..

బీజేపీకి సవాల్..

కాగా, సీఏఏ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీజేపీ ప్రభుత్వానికి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కోల్‌కతా సీఏఏ నిరసన ర్యాలీలో మమత మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్ఆర్సీలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఓటింగ్‌లో ఓడిపోయినట్లయితే అధికారం నుంచి బీజేపీ తప్పుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునేంత వరకు నిరసనలు విరమించవద్దని ప్రజలను మమతా కోరారు.

English summary
Describing the remarks of West Bengal Chief Minister Mamata Benerjee seeking a UN-monitored referendum over the amended Citizenship Act and the NRCas "irresponsible", Union Minister G Kishan Reddy on Friday said the international community has nothing to do with the CAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X