వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్‌లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికలైన దాదాపు రెండేళ్ల తర్వాత దేశంలో మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేసింది. దక్షిణాది, తూర్పు, ఈశాన్య భారతంలోని నాలుగు పెద్ద రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తంగా ఐదు అసెంబ్లీల పరిధిలో 824 స్థానాలు, 18.68 కోట్ల మంది ఓటర్లున్నారన్న ఈసీ.. ఎన్నికల విధుల్లో 2.7 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పింది. ఇక్కడిదాకా ఒక ఎత్తయితే, రాష్ట్రాల వారీగా పోలింగ్ దశల ప్రకటనలు వెలువడిన తర్వాత ఈసీ తీరుపై విమర్శల వెల్లువ మొదలైంది. ఎందుకంటే..

 ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి.. ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి..

దక్షిణాదిలో ఒకే దెబ్బలో..

దక్షిణాదిలో ఒకే దెబ్బలో..

పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఈసీ ఇవాళ ప్రకటించిన షెడ్యూల్ లో పలు అనూహ్య అంశాలున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు(234 అసెంబ్లీ స్థానాలు), కేరళ(140 సీట్లు) పుదుచ్చేరి(30)లో కేవలం ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. అదే అస్సాంలో మాత్రం మూడు దశల్లో (మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్6న) పోలింగ్ జరుగనుండగా, పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఏకంగా 8 ఫేజుల్లో(మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 6, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 17, ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 26, ఏప్రిల్ 29న) ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇది ముమ్మాటికీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడమేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..

ఈసీ సమాధానం చెప్పగలదా?

ఈసీ సమాధానం చెప్పగలదా?


మిగతా రాష్ట్రాలకు భిన్నంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం ఎనిమిది విడతల్లో నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసోంలో మూడు విడతలుగా, తమిళనాడు, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తూ, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క జిల్లాలోనే రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే.. మోదీ-షా తాళానికి నాట్యం చేయడం మానుకోవాలని పరోక్షంగా చురకలు అంటించారు. ఈసీ షెడ్యూల్ ప్రకటన అనంతరం శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

బీజేపీ ఫాయిదా కోసమే 8ఫేజులు

బీజేపీ ఫాయిదా కోసమే 8ఫేజులు

''ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందా? వాళ్ల ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? అస్సాం, తమిళనాడుల్లో తొందరగా ఎన్నికలు అవగొట్టుకుని, ఆ తర్వాత అందరూ కలిసి బెంగాల్ పై పడటానికే ఈ రకంగా షెడ్యూల్ రచించి ఉంటారు. అయితే, పాపం బీజేపీకి ఈ ఐడియా పెద్దగా కలిసిరాదు. ఎందుకంటే మోదీ-షాలతోపాటు మొత్తం బీజేపీకి మేం భారీ షాకివ్వబోతున్నాం...

దేశంలో ఏకైక మహిళా సీఎం

దేశంలో ఏకైక మహిళా సీఎం

బెంగాల్ లో మాత్రమే 8 విడతల్లో ఎన్నికలు ఒక ఎత్తయితే, రాష్ట్రంలోని ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటం విడ్డూరం కాక మరేంటి? చాలా జిల్లాల్లో రెండేసి విడతల్లో పోలింగ్ పెట్టారు. టీఎంసీకి గట్టి పట్టున్న సౌత్ 24 పరగణా జిల్లాలోనైతే ఏకంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తద్వారా మాకు వాళ్లు బీఏ పార్ట్ 1, పార్ట్ 2 పాఠాలు నేర్పిస్తున్నారు. ఏది ఏమైనా అసలైన ఆట ఇప్పుడే ఆరంభమైంది. మతాల ఆధారంగా మనుషుల్ని విభజించే బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమైపోయింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రినైన నన్ను బెంగాలీ మహిళలే తిరిగి గెలిపిస్తారు'' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు..

బెంగాల్ పోల్ షెడ్యూల్‌పై రచ్చ

బెంగాల్ పోల్ షెడ్యూల్‌పై రచ్చ


భారత ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు శుక్రవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా బెంగాల్ షెడ్యూల్ పై బీజేపీ అనుకూల, వ్యతిరేకుల మధ్య రచ్చ కొనసాగుతోంది. రెండేళ్ల కిందటి లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే తీరుగా దక్షిణాదిలో ముందే ఎన్నికలు పూర్తయి, బెంగాల్ లో మాత్రం భారీ ప్రహాసనంగా ప్రక్రియ జరిగిన తీరు బీజేపీకి లాభించిన విషయం చర్చకు వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఉద్ధండుల ప్రచారం, డబ్బుల పంపిణీకి అనుగుణంగానే షెడ్యూల్ విడుదలైందని మమతా బెనర్జీ కూడా ఆరోపిస్తున్నారు.

English summary
Mamata Banerjee has questioned the Election Commission's decision to conduct the West Bengal Assembly Election in eight phases. The West Bengal chief minister and Trinamool Congress chief asked the EC that if the Assam polls can be conducted in three phases and Tamil Nadu in one then why Bengal polls were being bifurcated into eight phases. She also alleged that the decision was taken to suit the convenience of the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X