• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మావోయిస్టుల కంటే బీజేపీ డేంజర్ -రాజకీయాలు గంభీరమైనవి -బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యలు

|

దేశంలో నక్సలైట్ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన పశ్చిమ బెంగాల్ లో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలోగానీ, ప్రజాస్వామిక పంథాలో నడిచే సీపీఎంను నిర్వీర్యం చేయడంలోగానీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాత్ర అందరికీ తెలిసిందే. అయితే మావోయిస్టులు, లెఫ్ట్ పార్టీలను ధీటుగా నిలువరించిన తన పరిస్థితి ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా అయిందన్నట్లుగా.. బెంగాల్ లో బీజేపీ విస్తరణపై మమత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఎర్రజెండాలను ఢీకొట్టినట్లే, కాషాయ దాడిని దీటుగా ఎదుర్కొంటానని ఆమె అంటున్నారు..

ఇన్‌సైడర్ షాక్ -జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా? -త్వరలో పెద్ద తలలు: సజ్జల అనూహ్య వ్యాఖ్యలుఇన్‌సైడర్ షాక్ -జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా? -త్వరలో పెద్ద తలలు: సజ్జల అనూహ్య వ్యాఖ్యలు

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో అధికార టీఎంసీ, ఇంకా ప్రతిపక్ష స్థానం కూడా పొందని బీజేపీ మధ్య విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసావాళ్లు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టుల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని అన్నారు.

 Mamata says BJP more dangerous than Maoists;terms desertions good riddance

ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగానే ప్రచారాన్ని మొదలుపెట్టిన మమత మంగళవారం పురూలియా జిల్లాలో టీఎంసీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ''ఈ బీజేపీ పార్టీ ఏదైదే ఉందో.. అది మావోయిస్టు పార్టీ కన్నా ప్రమాదకరమైంది. ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీకి ప్రజలు గుర్తొస్తారు. గత లోక్​సభ ఎన్నికల్లో జంగల్​ మహల్​ ఆదివాసీలకు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన బీజేపీ.. సీట్లు గెలుచుకున్న తర్వాత జనాన్ని పట్టించుకోలేదు. రాజకీయాలనేవి గంభీరమైన సిద్దాంతాలు, ఫిలాసఫీతో కూడుకున్నవి. అంతేకానీ ప్రతిరోజూ దుస్తులు మార్చుకున్నట్లుగా సిద్దాంతాలు ఉండకూడదు'' అని మమత వ్యాఖ్యానించారు. ఇటీవల..

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టీఎంసీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా బీజేపీ గూటికి చేరుతుండటంపై మమత అనూహ్య వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి వలసలు టీఎంసీకి రిలీఫ్ లాంటిదని, ఇంకా ఎవరైనా బీజేపీలో చేరడానికి వెళ్లాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చని అన్నారు. ఏది ఏమైనా బెంగాలీలు, టీఎంసీ పార్టీ.. కాషాయపార్టీ ముందు ఎప్పటికీ తలవంచబోదని మమత అన్నారు. ఈఏడాది జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఆధ్వర్యంలోని టీఎంసీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. ప్రస్తుతం 2 సీట్లుగా ఉన్న బీజేపీ బలం 100 దాటుతుందని సర్వేలు చెప్పాయి.

కన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనాకన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనా

English summary
West Bengal Chief Minister Mamata Banerjee said on Tuesday, BJP is "more dangerous than Maoists". Those who want to join the BJP can leave, but we will not bow our heads before the saffron party." Speaking about the defection of some TMC leaders, she further said, "Politics is a solemn ideology, philosophy; one can change clothes daily but not ideologies." Addressing a rally in Purulia on Tuesday, Mamata Banerjee spoke on a host of issues ahead of 2021 West Bengal Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X