• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ చేతిలో దీదీ జుట్టు -సీఎం పదవికి ‘గవర్నర్’ గండం -రాత్రి 7కు భేటీ -నందిగ్రామ్ ఓటమితో చిక్కులు

|

'సప్త సముద్రాలు ఈదిన వాడికి పిల్ల కాలువ ఎదురైతే.. వాట్ ఎ జోక్..' తరహా వాక్యాలు సినిమా పాటల్లో సరదాగా అనిపించవచ్చుకానీ, రాజకీయ వైకుఠపాళిలో చిన్న పొరపాట్లకు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈసీ-బీజేపీ ఒక్కటేనా అన్నట్లుగా సుదీర్ఘంగా ఎనిమిది విడతలుగా సాగిన బెంగాల్ అసెంబ్లీ పోరులో, దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ 'మోదీ-షా'ద్వయాన్ని ఢీకొట్టి, ధీశాలిగా నిలిచిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా నందిగ్రామ్ లో ఓడిపోయి గొప్ప చిక్కుల్లో పడిపోయారు. బెంగాల్ కు కనీసం కొద్దిరోజులైనా కొత్త ముఖ్యమంత్రి అవసరపడేంత స్థాయి ఇబ్బంది అది..

సర్కారు ఏర్పాట్లలో దీదీ బిజీ

సర్కారు ఏర్పాట్లలో దీదీ బిజీ

మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆదివారం వెలువడిన ఫలితాల్లో టీఎంసీ 214సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 76 స్థానాలకు పరిమితమైపోగా, ఆర్ఎస్ఎంపీ 1, ఇండిపెండెంట్ 1సీటును కైవసం చేసుకున్నారు. కాంగ్రెస, కమ్యూనిస్టు పార్టీలు ఖాతా తెవరకుండానే ఖతమైపోయాయి. వరుసగా మూడోసారి గెలుపొందిన దీదీ ప్రభుత్వ ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఆదివారం ఫలితాల ప్రక్రియ ముగింపు దశకు రాగానే, గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోరారు. ఆ మేరకు..

రాత్రి 7గంటలకు రాజ్ భవన్‌కు

రాత్రి 7గంటలకు రాజ్ భవన్‌కు

ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా బెంగాల్ లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా అభ్యర్థించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం రాత్రి 7 గంటలకు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్ ను కలవనున్నారు. అదే సమయంలో సీఎంగా రాజీనామాను సమర్పించి, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. సీఎం మమతకు అపాయింట్మెంట్ ఖరారు చేస్తూ రాజ్ భవన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతా సజావుగా సాగితే గనుక మంగళ లేదా బుధవారాల్లోనే మమత మూడోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కానీ..

6నెలలు కొత్త సీఎం.. దీదీకి మరో దారి లేదు..

6నెలలు కొత్త సీఎం.. దీదీకి మరో దారి లేదు..

బెంగాల్ లో అఖండ మెజార్టీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న మమతకు నందిగ్రామ్ ఓటమి రూపంలో అడ్డంకులు ఎదురుగా నిలిచాయి. నందిగ్రామ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 1736ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. రెండో స్థానంలో ఆమె పోటీ చేయని కారణంగా ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి కేంద్రం ప్రతినిధి గవర్నర్ అనుమతి తప్పనిసరైంది. బెంగాల్ లో శాసన మండలి కూడా లేనందున మమత సీఎం పదవి చేపడితే తిరిగి ఆరు నెలల్లో తప్పకుండా ఏదో ఒక స్థానం నుంచి గెలవాల్సి ఉంటుంది. లేదా అప్పటిదాకా కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓడిన మమతకు సీఎంగా గవర్నర్ అవకాశం కల్పిస్తారా, లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు, నందిగ్రామ్ ఫలితం ప్రకటనలో ఈసీ తీరును తప్పుపట్టిన మమత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. సీఈసీని కలిసిన టీఎంసీ నేతలు.. నందిగ్రామ్ లో పక్కాగా రీపోలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ స్వల్ప మార్జిన్ ఉన్న స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించినందనే ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

English summary
Mamata Banerjee will call on Bengal governor Jagdeep Dhankar tomorrow (Monday) at 7 pm and stake claim after the Trinamool Congress (TMC) secured a spectacular win in West Bengal defeating BJP and the Congress+Left alliance. TMC Delegation Meets EC Seeking Recounting In Nandigram
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X