• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధానికి అవమానం: 2013లో మోదీ చేసినట్లే ఇప్పుడు మమత -30ని.కు ఇంత రచ్చా? మహువా ఫైర్

|

యాస్ తుపానుపై సమీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ లో ఎదురైన అవమానంపై రాజకీయ రచ్చ ఇంకా పెద్దదవుతోంది. ప్రధాని పర్యటనలో అడుగడుగునా ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడమేకాదు, ఏకంగా 30 నిమిషాలు సీఎం కోసం పీఎం ఎదురు చూడటం, తీరా సీఎం మమత ఇలా వచ్చి, ఓ వినతి పత్రాన్ని ఇచ్చేసి, ప్రధాని సమీక్షలో పాల్గొనకుండానే వెళ్లిపోవడం పెనుదుమారం రేపింది. మమత తీరుపై బీజేపీ, దాని అనూకూల పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా, టీఎంసీ సైతం ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ 2013నాటి మోదీ చర్య ఒకటి వైరల్ అయింది. వివరాలివి..

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూమోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

పీఎం మోదీ వెయిటింగ్..

పీఎం మోదీ వెయిటింగ్..


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి అధినేత అయిన ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ సాధారణంగానే టైట్ గా ఉంటుంది. కరోనా వేళ నిత్యం రివ్యూలు, సంప్రదింపులతో బిజీగా ఉంటోన్న ఆయన.. యాస్ తుపాను కలిగిన నష్టాన్ని అంచనా వేసి, పరిస్థితులను సమీక్షించేందుకుగానూ శుక్రవారం ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఒడిశాలో అంతా సజావుగా జరిగింది. హోరాహోరీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఎదురుపడుతుండటంతో మోదీ-దీదీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ రేగింది. అనుకున్నట్లే పీఎంతో సమీక్షలో మమత తనదైన టెంపర్ ప్రదర్శించారు. పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని కాలైకుండ ఎయిర్ బేస్ లో జరిగిన సమీక్షకు సీఎస్ ను కూడా పంపని సీఎం.. 30 నిమిషాలు ఆలస్యంగా వెళ్లి, పీఎంకు వినతి పత్రం ఇచ్చేసి మూడు నిమిషాల్లోనే వెనుదిరగడం రచ్చకు దారితీసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం..

కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనంకూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం

బెంగాల్ సీఎస్ రీకాల్.. బీజేపీ రచ్చ

బెంగాల్ సీఎస్ రీకాల్.. బీజేపీ రచ్చ

మమతా బెనర్జీ చర్యను సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ ధిక్కరించినందుకుగానూ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్‌ బంధోపాధ్యాయను కేంద్రం రీకాల్‌' చేసింది. ఇప్పటికే రిటెరైన ఆయన పదవీకాలాన్ని 4 రోజుల క్రితమే 3 నెలలపాటు పొడిగించిన కేంద్రం.. ఇప్పుడాయనను బెంగాల్‌ నుంచి వెనక్కి రప్పించి, నార్త్ బ్లాక్ లో రిపోర్ట్ చేయాల్సింది ఆదేశించింది. ప్రధానికి అవమానంపై కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులంతా మమతా బెనర్జీని తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే,

  #TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
  2013లో మోదీ చేసిందే, నేడు మమత

  2013లో మోదీ చేసిందే, నేడు మమత

  మోదీ వెయిటింగ్ పై బీజేపీ అనవసరంగా రచ్చ చేస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఫైరయ్యారు. ‘‘తమ అకౌంట్లలో రూ.15లక్షలు పడతాయని భారతీయులంతా ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఏటీఎంల ముందు గంటలపాటు క్యూలు కట్టారు. వ్యాక్సిన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఏం? మీరు మాత్రం అప్పుడప్పుడైనా కాసేపు వెయిట్ చేయలేరా? 30 నిమిషాల ఆలస్యానికే ఇంత రచ్చ అవసరమా?'' అని మహువా మొయిత్రా చురక వేశారు. కాగా, 2013లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కీలకమైన నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్(ఎన్ఐసీ) భేటీకి డుమ్మా కొట్టిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. నాడు సీఎంగా ప్రధాని సింగ్ ను అవమానించిన మోదీ, ఇప్పుడు ప్రధానిగా సీఎం మమతా చేతిలో అవమానానికి గురయ్యారని కామెంట్లు చేస్తున్నారు. యూపీలో బీజేపీకి ఊపిరిచ్చిన ముజఫర్ నగర్ అల్లర్ల తర్వాత, మత ఘర్షణలు నివారించి, దేశాన్ని ఒక్కటిగా నిలపాలనే లక్ష్యంతో ఎన్ఐసీ ఏర్పాటుకాగా, దాన్ని మోదీ వ్యతిరేకించడం గమనార్హం.

  English summary
  The meeting between Prime Minister Narendra Modi and West Bengal chief minister Mamata Banerjee over cyclone Yaas snowballed into a bigger political controversy. as bjp leaders keep slamming mamata, tmc mp Mahua Moitra hits back, said, why So much fuss?, pm also need to wailt some times. meanwhile social media remembers then gujarat cm modi skips key nic meeting called by then pm manmohan singh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X