వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతాలో దీదీ నిరసన ప్రదర్శన : మోదీ, అమిత్‌పై విమర్శలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : బెంగాల్‌లో సేవ్ ఫర్ డెమోక్రసీ పేరుతో బీజేపీ చీఫ్ అమిత్ షా తీసిన ర్యాలీలో హింస చెలరేగడతో ... బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇటు బెంగాల్‌లో ప్రశాంత వాతావరణాన్ని అమిత్ షా చెడగొట్టారని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీదీ మార్చ్ ఫాస్ట్‌లో టీఎంసీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షాపై దీదీ నిప్పులు చెరిగారు.

దీదీ నిరసన ప్రదర్శన
బెలియాఘట, శ్యామ్ బజార్ గుండా మమతా నిరసన ప్రదర్శన కొనసాగగా .. వేలాదిమంది పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలు, బ్యానర్లతో పాల్గొన్నారు. మంగళవారం బీజేపీ గుండాలు చేసిన ఘటనను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను బీజేపీ తీసుకొచ్చిందని విమర్శించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. దీనికి కౌంటర్ అటాక్ చేసింది బీజేపీ. టీఎంసీ నేతలు అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారని విమర్శించారు

mamath march fast at kolkata

ఆరోపణలు .. ప్రత్యారోపణలు
ఇటు టీఎంసీ ఆరోపణలు బీజేపీ తోసిపుచ్చింది. వారంతా బెంగాలీలేనని అమిత్ షా స్పష్టంచేశారు. టీఎంసీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇటు మరోవైపు తమ ప్లెక్సీలను చించడంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఫొటోలకు మంచి రంగు వేసి .. బహుమతిగా ఇవ్వాలని మమతకు సెటైర్లు వేశారు మోదీ. ఇటీవల మమత ఇప్పటికీ స్వీట్ బాక్స్ పంపిస్తోందన్న మోదీ ... తాజాగా ప్లెక్సీల గిఫ్ట్ ఇస్తారని కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
The battle between the BJP and the TMC is going on. TIMC chief Mamata Banerjee has taken up the protest against Amit Shah's demolition of the calm atmosphere in Bengal. March is fast in the ranks, leaders and activists of the TMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X