వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు , రాహుల్ వ్యూహానికి బ్రేక్ వేసిన మమత ..ఈనెల 21న విపక్షాల భేటీకి నో

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు,రాహుల్ వ్యూహానికి మమత బ్రేక్ || Oneindia Telugu

బీజేపీయేతర కూటమిలో రాహుల్ గాంధీ ప్రాధాన్యతను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్న మమతాబెనర్జీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విపక్షాల భేటీ ప్లాన్ కు నో చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా తనని తాను గతంలోనే ప్రకటించుకున్న మమతాబెనర్జీ వ్యూహాత్మకంగానే విపక్ష భేటీకి బ్రేకులు వేశారు.

సమీక్షల పేరుతో సొంత పార్టీ నేతలనే విసిగిస్తున్నారా చంద్రబాబు .. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకుసమీక్షల పేరుతో సొంత పార్టీ నేతలనే విసిగిస్తున్నారా చంద్రబాబు .. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు

రాహుల్, చంద్రబాబుల వ్యూహానికి మమత బ్రేక్

రాహుల్, చంద్రబాబుల వ్యూహానికి మమత బ్రేక్

లోకసభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఈ నెల 21వ తేదీన విపక్షాల సమావేశం నిర్వహించాలని చంద్రబాబు, రాహుల్ గాంధీలు తలపెట్టారు. విపక్షాలన్నీ కలిసి ఓ ఉమ్మడి వ్యూహాన్ని రచించుకుని ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి ముందస్తు కార్యాచరణకు నడుం బిగించాలనేది రాహుల్, చంద్రబాబుల వ్యూహం. అయితే, బీజేపీయేతర కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 21వ తేదీన నిర్వహించాలనుకున్న విపక్ష పార్టీల సమావేశాన్ని వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబుతో మమతా ఆ విషయం చెప్పారు.

మోడీకి చెక్ పెట్టటానికి చంద్రబాబుతో మంతనాలు జరిపిన మమతాబెనర్జీ

మోడీకి చెక్ పెట్టటానికి చంద్రబాబుతో మంతనాలు జరిపిన మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు మమతాబెనర్జీతో బీజేపీయేతర కూటమి భేటీపై ముఖాముఖి చర్చలు జరిపారు. ఇరువురు నేతలు 45 నిమిషాల పాటు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినట్లు టీడీపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు చెప్పారు. ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు ప్రతిపక్షాల సమావేశం జరగాలనే ప్రతిపాదనపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. మోడీని ఎలాగైనా గద్దె దించాలన్న పట్టుదలతో ఉన్న మమతాబెనర్జీ , బీజేపీకి ఎలా చెక్ పెట్టాలన్న దానిపై చంద్రబాబుతో మంతనాలు చేశారు.

ఈనెల 21 న విపక్ష పార్టీల సమావేశానికి నో చెప్పిన మమతా బెనర్జీ

ఈనెల 21 న విపక్ష పార్టీల సమావేశానికి నో చెప్పిన మమతా బెనర్జీ

ఇక చంద్రబాబు ప్రతిపాదించిన విపక్ష పార్టీల సమవాశాన్ని ఫలితాల ముందు వద్దని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈవీఎం ల విషయంలో అనుమానాలు ఉన్నందున , ఈవీఎంల భద్రతపై దృష్టి సారించాల్సి ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని మమతా బెనర్జీ చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. ఇక మమత చెప్పిన విషయాన్ని ఇతర పార్టీలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు మమతా బెనర్జీకి చెప్పారు. మమతా బెనర్జీ సమావేశానికి నో చెప్పటంతో ఈనెల 21 న విపక్ష పార్టీల సమావేశం నిర్వహించటం డౌటే అన్న భావన వ్యక్తం అవుతుంది.

English summary
Andhra Pradesh Chief Minister and TDP president N Chandrababu Naidu held a closed-door discussion with his West Bengal counterpart Mamata Banerjee in Kharagpur on future plans of the opposition alliance.The two leaders met and spoke about the future plans of the Mahagatbandhan. Naidu and Didi (Banerjee) also discussed about the TDP leaders meeting with Rahul Gandhi in New Delhi On whether Banerjee will be attending the proposed meeting of the opposition parties likely to be held on May 21, It’s not decided that the meeting will be held on May 21... it seems that it might be deferred by a couple of days and take place after May 23. Didi Maybe taking part in it, he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X