వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ గ్యాంగ్ పేరుతో.. శరద్ పవార్ ఇంటిని పేల్చేస్తామని బెదిరింపులు...

|
Google Oneindia TeluguNews

శివసేన నేత సంజయ్ రౌత్‌తో పాటు,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌‌లకు బెదిరింపు కాల్స్ చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం(సెప్టెంబర్ 12) అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర టెర్రర్ స్క్వాడ్(ATS) వెల్లడించింది. నిందితుడు మూడు ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు ఉపయోగించి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలిపింది. యాంటీ టెర్రర్ స్క్వాడ్ డీసీపీ విక్రమ్ దేశ్‌మణే దీనిపై మీడియాకు వివరాలు వెల్లడించారు.

నిందితుడు పాలష్ ఘోష్‌ను కోల్‌కతాలో అరెస్ట్ చేసినట్లు విక్రమ్ తెలిపారు. అతనో జిమ్ ట్రైనర్ అని చెప్పారు. శివసేన నేత సంజయ్ రౌత్‌కు విక్రమ్ ఘోష్ పదేపదే బెదిరింపు ఫోన్ కాల్స్,ఎస్ఎంఎస్‌లు చేశాడన్నారు. తాను దావూద్ గ్యాంగ్ సభ్యుడినని చెబుతూ సంజయ్ రౌత్‌ను పలుమార్లు బెదిరించాడన్నారు. అంతేకాదు,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇల్లును కూడా పేల్చేస్తానని అతను బెదిరింపులకు దిగాడని... మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసానికి కూడా బెదిరింపు కాల్స్ చేశాడని పేర్కొన్నారు.

 Man arrested for threatening Sanjay Raut also said he would blow up Sharad Pawars house

గతంలో అతను దుబాయిలో 15 ఏళ్లు పనిచేశాడని.. మూడు ఇంటర్నేషనల్ సిమ్ కార్డులతో ఈ బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నాడని చెప్పారు. విచారణలో అతను నేరం అంగీకరించినట్లు తెలిపారు. తనకెలాంటి క్రిమినల్ నేపథ్యం లేదని.... కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రముఖ రాజకీయ నేతల ఫోన్ నంబర్స్ సంపాదించి వారికి ఫోన్ చేసినట్లు నిందితుడు తెలిపాడన్నారు. ఘోష్ అరెస్ట్ కోసం ముంబై పోలీసులు కోల్‌కతా పోలీసులను సంప్రదించగా.... దానిపై కూడా అతను సంజయ్ రౌత్‌కు ఫోన్ చేసి బెదిరించాడన్నారు. ఎట్టకేలకు కోల్‌కతా పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

English summary
The Maharashtra Anti-Terror Squad (ATS) on Saturday said the man who has been arrested for making threat calls to Shiv Sena leader Sanjay Raut, also threatened to blow up NCP chief Sharad Pawar's house. The ATS said the accused was using three international numbers for these calls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X