వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతుల ఫోటోలతో ఎర, నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్, గుట్టు రట్టయిందిలా

By Narsimha
|
Google Oneindia TeluguNews

గురుగ్రామ్: సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేస్తూ వారి వ్యక్తిగత ఫోటోలను వారికి తెలియకుండానే దొంగిలించి వాటితో కొత్త ప్రోఫైల్ క్రియేట్ చేసి డబ్బులను సంపాదిస్తున్నాడు. యువతుల ఫోటోలతో పురుషులతో చాటింగ్ చేసేవాడు. ఎట్టకేలకు నిందితుడి భాగోతం గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు.

డిగ్రీ చదువుకొన్న ఆకాశ్ చౌదరి గతంలో ఓ కాల్ సెంటర్‌లో పనిచేసేవాడు. సోషల్ మీడియాలో ఆకాశ్ చౌదరి ఫేక్ ప్రోఫైల్ క్రియేట్ చేశాడు. ఈ ప్రోఫైల్‌కు 10 లక్షల మంది ఫాలోవర్లున్నారు.

ఆకాశ్ చౌదరికి దుర్బుద్ది పుట్టింది. సులభంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. ఈ మేరకు సోషల్ మీడియాను ఎంచుకొన్నాడు. కొత్తవారితో స్నేహలు చేయడం వారి ఫోటోలను వారికి తెలియకుండానే డౌన్‌లోడ్ చేసి వాటితో కొత్త ప్రోఫైల్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించేవాడు.

సోషల్ మీడియా ఫోటోలతో వ్యాపారం

సోషల్ మీడియా ఫోటోలతో వ్యాపారం

ఆకాశ్ చౌదరి సామాజిక మాధ్యమాల్లో నకిలీ పేర్లతో కొత్తవారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవాడు. వారు రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగానే వాళ్ల అకౌంట్‌లోని ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి వాటితో కొత్తగా ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయడం, ఆ తర్వాత అందమైన అమ్మాయిల ఫోటోలతో క్రియేట్‌ చేసిన ప్రొఫైల్‌తో మగవాళ్లకు చాటింగ్‌తో ఎరవేసి, తన మొబైల్‌ వాలెట్‌లోకి డబ్బులు పంపించాలని డబ్బులు డిమాండ్ చేశారు.

యువతుల ఫోటోలతో అడ్వర్‌టైజ్‌మెంట్

యువతుల ఫోటోలతో అడ్వర్‌టైజ్‌మెంట్

ఇలా సేకరించిన యువతుల ఫోటోలను చిన్న చిన్న కంపెనీల ప్రొడక్టులను ప్రొమోట్‌ చేయడానికి ఆకాష్ చౌదరి విక్రయించాడు. విచారణలో ఈ విషయాన్ని గుర్తించినట్టుగా ఢిల్లీ సీనియర్‌ పోలీస్‌ అధికారి చిన్మయ్‌ బిజ్వాల్‌ తెలిపారు.ఇలా చాలామంది ఫోటోలను తస్కరించి ఉపయోగించుకొన్నాడు.

వ్యాపారి నుండి రూ.70 వేలు లాగాడు

వ్యాపారి నుండి రూ.70 వేలు లాగాడు

ఇలా ముంబైకి చెందిన ఓ వ్యాపారి ద్వారా రూ.70 వేలు ద్వారా తన మొబైల్‌ వాలెట్‌లో వచ్చేలా చేసుకొన్నాడని పోలీసులు చెప్పారు. అమ్మాయిల పేరుతో చాటింగ్ చేసి ఈ రకంగా డబ్బులను రాబట్టుకొన్నాడు. అంతేకాదు అందమైన యువతులు, మహిళల ఫోటోలతో సులభంగా డబ్బులు వచ్చేందుకు వీలుగా విక్రయించేవాడు.

ఢిల్లీ యువతి ఫిర్యాదుతో

ఢిల్లీ యువతి ఫిర్యాదుతో

ఢిల్లీలోని లజపత్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన చిత్రాలు ఇస్టాగ్రామ్‌లో దర్శనం ఇవ్వడం, అలాగే తన పేరుతో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి కొన్ని బ్రాండులకు ప్రొమోట్‌ చేయడం గుర్తించిండంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే చాలా వెబ్‌సైట్లలో ఆమె అనుమతి లేకుండా ఆమె ఫోటోలతో ప్రొడక్టులను ప్రొమోట్‌ చేసుకుంటున్నట్లు ఆమె గుర్తించింది. 2016 నుంచి ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు క్రియేట్‌ చేసి అడ్వర్టైజ్‌ మెంట్ల ద్వారా తేలికగా డబ్బులు సంపాదిస్తున్నాడని పోలీసులు తెలిపారు.ఆకాశ్‌ చౌదరీ ఈ విధంగా సుమారు 20 మందిని మోసగించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A 34-year-old commerce graduate Akash Choudhary was arrested in Gurgaon for creating fake profiles of women he met via Facebook and Instagram. Akash used to send a friend or follow request to women on various social media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X