వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు: తింటే అంతే సంగతి.. దందా నడుస్తోందా?

గుడ్డుపై పెంకు కూడా ప్లాస్టిక్ లా ఉండటంతో అనుమానం వచ్చిన అనిత అగ్గిపుల్లతో దాన్ని మండించగా.. మంట అంటుకుంది.

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: తినే ప్రతీ ఆహార పదార్థం కల్తీమయం అయిపోతోంది. ఆఖరికి ప్లాస్టిక్ రైస్ సైతం మార్కెట్లోకి దిగుమతి అవుతున్న పరిస్థితి. తాజాగా బెంగాల్ లో ప్లాస్టిక్ కోడి గుడ్లు సైతం వెలుగుచూశాయి. ఈ మొత్తం దందా వెనుక ఎవరున్నారో కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. కోల్ కతాలోని పార్క్ సర్కస్ మార్కెట్ వద్ద షమీమ్ అన్సారీ అనే వ్యక్తి కిరాణ దుకాణం నడుపుతున్నాడు. గురువారం సాయంత్రం స్థానిక మహిళ అనిత అతని షాపులో కోడి గుడ్లు విక్రయించింది. ఇంటికి వెళ్లాక ఆమ్లెట్ వేద్దామని పెనంపై వాటిని పగలగొట్టగా.. ప్లాస్టిక్ లా అట్టుకుట్టుకుపోయాయి.

 man arrested for selling plastic eggs to woman in kolkata

గుడ్డుపై పెంకు కూడా ప్లాస్టిక్ లా ఉండటంతో అనుమానం వచ్చిన అనిత అగ్గిపుల్లతో దాన్ని మండించగా.. మంట అంటుకుంది. దీంతో ఇవి నకిలీ ఎగ్స్ అని అనిత నిర్దారించుకుంది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం నాడు అన్సారీని పోలీసులు ఫిర్యాదు చేశారు. రూ.1.15లక్షలకు తాను హోల్ సేల్ గా ఆ కోడిగుడ్లను విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు.

దీంతో సదరు హోల్ సేల్ అధికారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా.. కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ కూడా దీనిపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది.

English summary
A shopkeeper was arrested here on Friday for allegedly selling "artificial eggs" to a woman, police said.A shopkeeper named Md. Shamim Ansari was arrested on Friday morning from Park Circus Market for allegedly selling artificial plastic eggs to the complainant Anita Kumar," an officer from the Kolkata Police's Enforcement Branch said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X