బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్: థియేట‌ర్‌లో యువ‌కుడిపై దాడి: జాతీయ గీతాన్ని అవ‌మానించినందుకు!

|
Google Oneindia TeluguNews

బెంగ‌ళూరు: థియేట‌ర్‌లో జాతీయ గీతాన్ని ప్ర‌ద‌ర్శించే స‌మ‌యంలో ప్రేక్ష‌కులంద‌రూ లేచి నిల్చుంటారు. జాతీయ గీతాన్ని గౌరవిస్తారు. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడో యువ‌కుడు. జాతీయ గీతం ప్ర‌ద‌ర్శిత‌మౌతున్న స‌మ‌యంలో లేచి నిల్చోలేదు. దీనితో తోటి ప్రేక్ష‌కులు అతనిపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అనంత‌రం పోలీసుల‌కూ ఫిర్యాదు చేశారు. ద‌గ్గ‌రుండి మ‌రీ అరెస్టు చేయించారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది.

మోడీ! అలా జరగకపోతే దేశ రాజధానిలో బ‌హిరంగంగా ఉరి వేసుకుంటావా? <br>మోడీ! అలా జరగకపోతే దేశ రాజధానిలో బ‌హిరంగంగా ఉరి వేసుకుంటావా?

Man attacked for not standing up during National Anthem in INOX Garuda mall

ఆ యువ‌కుడి పేరు జితిన్‌. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. వారం రోజుల కింద‌టే బెంగ‌ళూరుకు వ‌చ్చాడు. బెంగ‌ళూరులోని మాగ‌డి రోడ్‌లో ఉన్న గ‌రుడా మాల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మౌతోన్న అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ మూవీ చూడ‌టానికి ఒంట‌రిగా వెళ్లాడు. విశేష‌మేమిటంటే- జాతీయ గీతాన్ని ప్ర‌ద‌ర్శించే స‌మ‌యంలో థియేట‌ర్‌లో లేచి నిల్చోవాల‌నే నిబంధ‌న ఉన్న‌ట్లు జితిన్‌కు తెలియ‌దు.

ఎప్ప‌ట్లాగే- సినిమా ఆరంభానికి ముందు.. జాతీయ గీతాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో థియేట‌ర్ మొత్తం లేచి నిల్చుంది ఒక్క జితిన్ త‌ప్ప‌. గీతాలాప‌న ముగిసిన అనంత‌రం- తోటి ప్రేక్షకులు అత‌ణ్ని నిల‌దీశారు. సుమన్ కుమార్ అనే యువకుడు జితిన్ తో గొడ‌వ ప‌డ్డాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా చిలికి చిలికి గాలీ వాన‌గా మారింది. సుమ‌న్ కుమార్‌కు జితిన్ దూషించాడు. దీనితో ఆగ్ర‌హానికి గురైన సుమ‌న్ కుమార్ అత‌నిపై దాడికి దిగాడు. ఇద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ను గుర్తించిన థియేట‌ర్ యాజ‌మాన్యం వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

సుమన్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా జితిన్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ సెక్షన్ 2కింద జితిన్ పై కేసు న‌మోదు చేసిన‌ట్లు స్థానిక అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శశిధర్ తెలిపారు. అదే రోజున స్టేషన్ బెయిల్ పై జితిన్‌ను విడుద‌ల చేసిన‌ట్లు చెప్పారు. ఈ విష‌యాన్నంత‌టినీ జితిన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. థియేట‌ర్ యాజ‌మాన్యం త‌న‌ను అవ‌మానించింద‌ని పేర్కొన్నాడు.

English summary
A 29-year-old man was arrested by Bengaluru police earlier this week after he refused to stand up while the national anthem was playing in theater. According to the police, Jithin, a sound engineer had come to Bengaluru from Australia a week ago and had decided to watch the movie Avengers: Endgame.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X