వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: సైకిల్‌పై వెళ్తుంటే ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదని చలానా, పోలీసులు జాలి కూడా చూపారు!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: సాధారణంగా బైక్ పైన వేగంగా వెళ్లినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా లేదా ట్రిపుల్ రైడింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారు. లేదంటే ఫోటోలు తీస్తారు. కారులో సీటు బెల్ట్ పెట్టోకుకున్నా, ఓవర్ స్పీడ్‌తో వెళ్లినా ఆపుతారు. కానీ కేరళలో ఆసక్తిర సంఘటన చోటు చేసుకుంది.

మోడీకి భారీ షాక్: సర్వే... ఆ 3 రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్‌దే! ఎవరికి ఎన్ని సీట్లు అంటే?మోడీకి భారీ షాక్: సర్వే... ఆ 3 రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్‌దే! ఎవరికి ఎన్ని సీట్లు అంటే?

ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదని చలానా

ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదని చలానా

కేరళకు చెందిన పోలీసులు ఓ వ్యక్తి సైకిల్ పైన వెళ్తుంటే అతను రహదారి పైన వేగంగా వెళ్తున్నాడని, హెల్మెట్ పెట్టుకోలేదని చలానా వేయడం అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. దీనిపై విమర్శలు రావడంతో పోలీస్ బాస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మరో ప్రాంతం నుంచి పని కోసం వచ్చిన ఆ వ్యక్తి సైకిల్ పైన వెళ్తుంటే పోలీసులు ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదంటూ పైన్ వేశారు.

సోషల్ మీడియాలో పోస్ట్

సోషల్ మీడియాలో పోస్ట్

ఈ సంఘటన కాసర్‌గోడ్ జిల్లాలో గత వారం చోటు చేసుకుంది. చలానా కట్టాలంటూ పోలీసులు తనకు ఇచ్చిన చలానా కాగితాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సంఘటన వెలుగు చూసింది. ఆ యువకుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవాడు. కేరళకు వలస వచ్చి ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నారు.

 రూ.2000ల జరిమానా, జాలిపడి రూ.500 చలానా

రూ.2000ల జరిమానా, జాలిపడి రూ.500 చలానా

కంబాలా ప్రాంతంలో జాతీయ రహదారి గుండా సైకిల్‌పై తాను పని చేస్తున్న చోటుకు వెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసులు అతనిని ఆగమని చెప్పారు. ఆ తర్వాత అతి వేగంగా వెళుతున్నావని, హెల్మెట్‌ కూడా లేదని రూ.2000 జరిమానా కట్టాలని చెప్పారు. అతను కూలీగా పని చేస్తున్నాడని తెలుసుకోని జాలిపడి రూ.500 విధించారట.

టైర్లలో గాలి తీసేశారు, ఆ వాహనం ఓ మహిళది

టైర్లలో గాలి తీసేశారు, ఆ వాహనం ఓ మహిళది

మరో షాకింగ్ విషయం ఏమంటే అతని సైకిల్ టైర్లోంచి గాలి తీసేశారు. అతనికి వారు రాసిచ్చిన చలాను కాగితాన్ని పరిశీలిస్తే అందులో ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నెంబరు ఉంది. ఆ ద్విచక్ర వాహనం ఒక మహిళది అని తేలింది. అతను ఈ విషయాన్ని తెలుపుతూ చేసిన పోస్ట్ వైరల్‌ కావడంతో ఈ సమాచారం అధికారులకు చేరింది. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అతను కేరళలో కార్మికుడిగా పని చేస్తూ రోజుకి రూ.400 సంపాదిస్తున్నాడు.

English summary
Kerala police this last week intercepted a migrant worker and asked him to pay a fine for 'over speeding' a get this, bicycle. The matter which came to light from the Kasargod district is one that attracts not just shock but also inspires confusion. However, the question that we are left with is about whether one really needs a license to ride a bicycle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X