• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భోజనానికి పిలిచి, తూపాకీతో కాల్చి ... అల్లుడి ఘాతుకం ..?

|

డెహ్రాడూన్ : వరకట్న రక్కసి సొంత మామపై కాల్చేవరకు వెళ్లింది. డబ్బుల విషయంలో మొదలైన గొడవ తూటాల తీసేవరకు వెళ్లింది. పెద్దమనిషిగా విడిగా ఉండమని ఆ తండ్రి చెప్పడమే తన పాలిట నేరమైంది. ఉత్తరాఖండ్‌లో పిల్లనిచ్చిన మామపైకి తూపాకీ ఎక్కుపెట్టాడో అల్లుడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి .. తానే కాల్చానని చెప్పడం గమనార్హం.

పిల్లనిస్తే ..

సూల్తాన్‌‌పూర్‌పట్టికి చెందిన రాయి అహ్మద్ కూతురు రష్కర్. ఆమెను ఇక్రమ్ అనే అతడికిచ్చి పెళ్లిచేశారు. కుందా పోలీసుస్టేషన్ పరిధిలో ఉంటున్న ఇక్రమ్ .. బైక్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. పెళ్లైన కొద్దిరోజులు అంతా బాగానే ఉంది. కానీ తర్వాతే పరిస్థితి మారిపోయింది. వరకట్నం డబ్బులు తీసుకురావాలని రష్కర్‌ను వేధించడం మొదలుపెట్టాడు. భర్త పోరు పడలేక తండ్రికి విషయం చెప్పింది. ఇంట్లో పరిస్థితి ఇదేవిధంగా ఉంటుందని .. బయట విడిగా దంపతులు ఉండాలని సలహా ఇచ్చారు అహ్మద్. ఇదే అతను చేసిన తప్పయింది.

సలహా ఇస్తే .. కాల్చాడు ..

Man calls father-in-law for dinner, shoots at him, calls cops

మామ సలహాను పైకి ఓకే అని చెప్పిన ఇక్రమ్ .. తర్వాత అతనిని ఇంటికి భోజనానికి పిలిచాడు. అయితే ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకొని తన పథకాన్ని పక్కాగా అమలు చేశాడు. వరకట్నం విషయమై ఇద్దరికి గొడవ జరిగింది. వాస్తవానికి పెళ్లి సమయంలో అహ్మద్ .. ఇచ్చిన మాట ప్రకారం నగదు ముట్టజెప్పారు. అయితే ఇక్రమ్, తల్లి, సోదరీలు మాత్రం వరకట్నం తేవాలని పురిమేవారు. దీంతో అతను కట్నం మైకంలో పడిపోయాడు. మామా అల్లుళ్ల మధ్య వాదనలు పీక్ స్టేజీకి చేరిపోయాయి. దీంతో ఇక్రమ్ తన వద్ద ఉన్న తూపాకీ తీసి మామపై కాల్చాడు. తర్వాత తీరిగ్గా పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చేవరకు 20 నిమిషాల సమయం పట్టింది .. అయినా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అలానే ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలసులు ఆస్పత్రికి తరలించారు. అతనికి చికిత్స జరగుతుందని .. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు ఇక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttarakhand Sultanpurpatti resident Raes Ahmed's daughter Rukhsar married Ikram, who lived in Kunda police station area and worked as a bicycle mechanic, on February 18, 2019. Soon after their marriage, there was rift between the couple allegedly over fresh dowry demands by Rukhsar's in-laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more