• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొగుడు కాదు కాలయముడు, గర్భవతి అయిన భార్య గొంతుపిసికి, ముక్కలుగా నరికి గిర్నీలో వేసి, కాల్చి...

|

ఔను.. ఓ మొగుడు కాలయముడిగా మారాడు. గర్భవతి అయిన తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. గొంతునులిమి చంపేశాడు. తర్వాత కోపం తగ్గకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికి ఆమె శరీరభాగాలను ప్లోర్ మిల్‌లో వేసి రుబ్బాడు. మిగతా శరీర భాగాలను కాల్చివేసి.. ఏం తెలియనట్టు ఉన్నాడు. కానీ తన తండ్రిలో దాగి ఉన్న నరరూప రాక్షసుడిని అతని పెద్ద కూతురు సజీవ సాక్ష్యంగా మారారు. ఆమె వల్ల అత్యంత దారుణంగా జరిగిన హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో దారుణం జరిగింది. ఈ నెల 4వ తేదీన ఘటన జరిగినా.. ప్రపంచానికి తెలియలేదు. అయితే అతని పెద్ద కూతురు అమ్మమ్మ వారింటికి వెళ్లడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..నిందితుడు రవీంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిద్దరూ.. వారికిద్దరు..

వారిద్దరూ.. వారికిద్దరు..

రాయ్‌బరేలికి చెందిన రవీంద్ర కుమార్ (35), ఉర్మిళ (27)కు 2011లో వివాహామైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 11, ఏడేళ్ల కూతుళ్లు ఉన్నారు. ఉర్మిళ మరోసారి గర్భం దాల్చింది. అయితే ఆమె ఇప్పుడు కూడా ఆడపిల్లకు జన్మనివ్వబోతుందని రవీంద్ర కుమార్ తెలుసుకొన్నాడు. ఈ విషయంపై జనవరి 4వ తేదీన భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో పిల్లలు ఉన్నారని కూడా పట్టించుకోకుండా భార్యతో గొడవపడ్డాడు. అలా మృగాడిలా మారి.. తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

తండ్రి, సోదరుల సాయం

తండ్రి, సోదరుల సాయం

తన కూతుళ్లు ఉన్నారని కూడా మరచిపోయి దారుణంగా ప్రవర్తించాడు. అయితే రవీంద్రకుమార్ తండ్రి కరమ్ చంద్ర, అతని సోదరులు సంజీవ్, బ్రిజేశ్ కూడా ఉర్మిళను హతమార్చేందుకు సహకరించారని పెద్ద కూతురు ఆరోపించారు. వెంటనే ఉర్మిల సోదరి విద్యాదేవి పోలీసులకు దీహ్ ఫిర్యాదు చేశారు. అతని ఇంట్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నేరం చేసినట్టు అంగీకరించాడు. అయితే అంతకుముందు రవీంద్ర కుమార్ తన చావు తెలివితేటలు చూపించాడు. తన భార్య కనిపించడం లేదని ఈ నెల 4వ తేదీన 112కి ఫోన్ చేశాడు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు కనుగొనేలోపే.. అతను చేసిన అరాచకం వెలుగుచూసింది.

 మరో ఆడపిల్ల అని..

మరో ఆడపిల్ల అని..

గర్భవతి అయిన భార్య మరోసారి కూడా ఆడ శిశువును కనబోతుందనే సమాచారంతో.. రవీంద్రకుమార్ పశువుగా మారి గొంతునులిమాడు. తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశాడు. పిండి రుబ్బే గిర్నీలో వేసి గ్రైండ్ చేశాడు. మరికొన్ని శరీర భాగాలను కాల్చివేశాడు. తర్వాత గన్నీబ్యాగులో అవయవాలను తీసుకొని.. ఇంటినుంచి 4 కిలోమీటర్ల దూరంలో పడవేశాడు. ఇంటిలో లభించిన కొన్ని శరీర భాగాలను లక్నోలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పోలీసులు పంపించారు. ఆ శరీర భాగాలు ఉర్మిళవి అవునో కాదో అనే అంశాన్ని డీఎన్ఏ ఆధారంగా గుర్తిస్తారు.

6 బృందాలు

6 బృందాలు

రవీంద్రకుమార్ సహా అతని తండ్రి, సోదరులను అరెస్ట్ చేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా నేరం అంగీకరించిన రవీంద్రకుమార్.. ఒకనొక సమయంలో పోలీసులతో వాదించి సృహ కూడా కోల్పోయాడని తెలుస్తోంది.

English summary
ravindra kumar in Uttar Pradesh has been arrested for one of the most gruesome murders in recent times where he strangulated his 27-year-old pregnant wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X