వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృగరాజుతో చెలగాటం.. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి, రెచ్చగొట్టిన యువకుడు...(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

మృగరాజుతో చెలగాటం.. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి, రెచ్చగొట్టిన యువకుడు...(వీడియో)

పులి నొట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా ? సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఉందా ? ఖచ్చితంగా లేదు. పులి, సింహాలను ఎన్‌క్లోజర్ నుంచి చూడాలంటేనే గజ్జుమంటారు. అదీ దాని వద్దకెళ్లడం అంటే మాములు విషయం కాదు. బీహార్‌కు చెందిన రెహన్ ఖాన్ మాత్రం సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అంతేకాదు సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎన్‌క్లోజర్‌లో అతని సాహసాన్ని బయట నుంచి చూస్తోన్న జనం గజగజ వణికిపోయారు.

జూ లో హల్‌చల్

జూ లో హల్‌చల్

ఢిల్లీలోని జూ లో జంతువులను చూసేందుకు గురువారం సందర్శకులు వచ్చారు. వారిలో బీహార్‌కు చెందిన రెహన్ ఖాన్ ఒక్కరు. అందరూ జంతువులను చూస్తుండగా రెహన్ ఖాన్ మాత్రం సింహంతో ఆటాడే సాహసం చేశాడు. అయితే రెహన్ ఖాన్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. అతను మద్యం కూడా సేవించాడని ప్రాథమికంగా తెలిసింది.

ఒక్కసారిగా వచ్చి

ఒక్కసారిగా వచ్చి

జూ లో సందర్శకులు పులులు, సింహాలను చూస్తున్నారు. ఇంతలో రెహన్ ఖాన్ అక్కడికి వచ్చి సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు అతనిని వద్దని వారించినా ఫలితం లేకపోయింది. అందులో దూకేశాడు. అక్కడే ఉన్న సింహం కూడా రెహన్ ఖాన్ వద్దకు వచ్చింది. దానిని చూసిన ఖాన్ అదర లేదు, బెదరలేదు. దాని ముందే కుప్పి గంతలు చేశాడు. ముందు కూర్చొని సింహనికే సవాల్ విసిరాడు. ఇదంతా చూస్తున్న జనం గగ్గొలు పెట్టారు. అయినా వినకుండా దానిముందే పడుకున్నాడు. లేచాడు, సింహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూస్తున్న సందర్శకుల గుండె ఆగినంత పనైపోయింది.

అడుగు దూరంలో

సింహానికి కేవలం అడుగుదూరంలోనే రెహన్ ఖాన్ ఉండిపోయాడు. సింహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో.. అప్పటికే అక్కడికి వచ్చిన జూ సిబ్బంది సింహాన్ని కూల్ చేశారు. సింహాం రెచ్చిపోకుండా చేసి.. శాంతపరిచారు. ఈ లోపు మెరికల్లాంటి సిబ్బంది కొందరు వచ్చి ఎన్‌క్లోజర్ నుంచి రెహన్‌ఖాన్‌ను బయటకు తీశారు. సింహం ముందు కుప్పిగంతలు వేసినా.. ఏమీ కాకుండా బయటకు తీశామని జూ అధికారులు పేర్కొన్నారు. రెహన్ ఖాన్‌కు గాయాలేమీ కాలేదని తెలిపారు.

మానసిక పరిస్థితి బాలేదు

మానసిక పరిస్థితి బాలేదు

రెహన్ ఖాన్‌ది బీహార్ అని డీఎస్పీ తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని భావిస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు అతను మద్యం సేవించాడని భావిస్తున్నారు. అతనికి వైద్య పరీక్షలు చేయిస్తామని.. దీంతో ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు జూలో ఘటన జరిగిందని ఆయన మీడియాకు వివరించారు.

English summary
rehan khan jumped into the lion enclosure at Delhi Zoo and sat face-to-face with the wild animal for some time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X