వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భావ ప్రాప్తి కోసం ఇలా కూడా చేస్తారా... 25 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్..

|
Google Oneindia TeluguNews

అసోం వైద్యులు ఇటీవల ఓ వెరైటీ కేసును డీల్ చేశారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడి మూత్రాశయంలో మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్‌ను గుర్తించారు. తనకు కేబుల్స్,ఇతరత్రా వస్తువులు తినే అలవాటుందని మొదట ఆ యువకుడు వైద్యులతో అబద్దం చెప్పాడు. కానీ ఆపరేషన్ టేబుల్‌ పైకి వెళ్లాక.. అసలు విషయం బయటపడింది. ఆ కేబుల్‌ను అతను నోటి ద్వారా పంపించలేదని.. పురుషాంగానికి ఉండే రంధ్రం ద్వారా కేబుల్‌ను లోపలికి పంపించాడని గుర్తించారు. అయితే అలా ఎందుకో చేశాడో తెలిశాక వైద్యులే షాక్ తిన్నారు.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

అసోంకి చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. పొరపాటున మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్‌ను మింగేశానని.. అప్పటినుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నానని వైద్యులతో చెప్పాడు. వైద్యులు అతనికి ఎండోస్కోపీ నిర్వహించారు. మల పరీక్షలు కూడా చేశారు. కానీ కడుపులో ఎక్కడా ఆ కేబుల్ వైర్ కనిపించలేదు. దీంతో సర్జరీ చేయాలని నిర్ణయించిన వైద్యులు అతన్ని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు.

అసలు విషయం ఇలా వెలుగులోకి..

అసలు విషయం ఇలా వెలుగులోకి..

సర్జరీలో భాగంగా అతని జీర్ణాశ్రయాన్ని పరిశీలించిన వైద్యులకు.. కేబుల్ వైర్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆపరేషన్ టేబుల్‌ మీదే అతనికి ఎక్స్‌రే తీశారు. ఆశ్చర్యంగా అతని మూత్రాశయంలో ఆ వైర్ కనిపించింది. సర్జరీ ద్వారా దాన్ని తొలగించామని,ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డా.వల్లియుల్ ఇస్లాం తెలిపారు. అతను నోటి నుంచి కేబుల్ వైర్ మింగానని తమతో అబద్దం చెప్పాడని.. కానీ అతను పురుషాంగం ద్వారా దాన్ని లోపలికి పంపించాడని చెప్పారు.

25ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్..

25ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్..

తన 25 ఏళ్ల వైద్య వృత్తిలో ఇలాంటి కేసును చూడలేదని డా.వల్లియుల్ అన్నారు. సదరు పేషెంట్ లైంగిక భావ ప్రాప్తి కోసం కేబుల్స్‌,ఇతరత్రా వస్తువులను పురుషాంగానికి ఉండే రంధ్రం ద్వారా లోపలికి పంపించే అలవాటు చేసుకున్నాడని చెప్పారు. ఈ రకమైన భావప్రాప్తి పొందడాన్ని 'యురెత్రల్ సౌండింగ్' అంటారని తెలిపారు. అయితే ఈసారి కేబుల్ మూత్రాశయం దాకా వెళ్లిపోవడంతో.. అక్కడే ఇరుక్కుపోయిందని చెప్పారు.

ముందే చెప్పి ఉంటే..

ముందే చెప్పి ఉంటే..

ఒకవేళ అతను ముందే అసలు విషయం చెప్పి ఉంటే.. ఆ కేబుల్ లోపలికి పంపించిన మార్గం నుంచే బయటకు తీసేవాళ్లమని.. కానీ అప్పటికే ఆపరేషన్ టేబుల్‌పై ఉండటంతో.. సర్జరీ ద్వారా వైర్‌ను తొలగించామని చెప్పారు. అతనికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని,కేవలం లైంగిక భావ ప్రాప్తి కోసమే అలా చేశాడని అన్నారు.

English summary
A routine operation in an Assam hospital took a different turn this week when the doctor performing the surgery and accompanying attendants found a mobile phone charger cable inside the urinary bladder of a patient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X