వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు వీడు తండ్రేనా: పాప పుట్టిందని ఇంటిపై నుంచి విసిరేశాడు

|
Google Oneindia TeluguNews

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ మానవుడు మాత్రం అక్కడే ఉన్నాడు. పాతకాలపు ముఢనమ్మకాల దగ్గరే ఆగిపోయాడు. ఆడపిల్ల పుడితే శాపంగా భావిస్తున్నాడు. ఫలితం చిన్నారి కళ్లు తెరిచి లోకం చూడకముందే ప్రాణాలను చిదిమేస్తున్నాడు. తనకి కూడా జన్మనిచ్చింది ఒక స్త్రీ అని మరిపోతున్నాడు. తన భార్యకు రెండవ కాన్పులో కూడా ఆడపాప పుట్టిందని చిన్నారిని ఇంటిపై నుంచి కిందకు విసిరేశాడు ఓ దౌర్భాగ్యపు తండ్రి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.

<strong>ఆ చిన్నారిని బతికుండగానే చంపేశారు</strong>ఆ చిన్నారిని బతికుండగానే చంపేశారు

వివరాల్లోకెళితే... అరవింద్ గంగ్వార్ అనే వ్యక్తి పర్దౌలీ గ్రామంలో నివాసముంటున్నాడు. అతనికి ఒక కూతురు. భార్య రెండో కాన్పులో కూడా ఆడపాప జన్మించడంతో అసహనానికి గురయ్యాడు. ప్రతిరోజు ఇంటికి తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. ఇలా ఏడాది గడిచిపోయింది. గురువారం ఫూట్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చిన అరవింద్.. పాపను ఇంటిపైకి తీసుకెళ్లి కిందకు విసిరేశాడు. ఏపాపం తెలియని చిన్నారిని చంపే ప్రయత్నం చేశాడు.ఆ బిడ్డకు ఇంకా భూమిపై నూకలు మిగిలే ఉన్నాయి. భగవంతుడు ఆ బిడ్డను కాపాడాడు. ఇంటి పైనుంచి విసిరేయడంతో పాపకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించింది తల్లి. ప్రస్తుతం చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతోంది.

Man desperate for a son, throws 18months old daughter from terrace

అరవింద్ భార్య రెండవ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని రోజు అరవింద్ మద్యం సేవించి గొడవ చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న అరవింద్ గురువారం తన కూతురును ఇంటిపైకి తీసుకెళ్లి కిందకు విసిరేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A man, desperate for a son, allegedly threw his 18-month daughter from the terrace of his home in an Uttar Pradesh village after his wife gave birth to another girl.The toddler, Kavya, was seriously injured after the incident in Pardhauli village, under CB Ganj police station area on Thursday and has been admitted to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X