ప్రియుడిని కుర్చీకి కట్టేసి శృంగారం... ప్రయోగం బెడిసికొట్టడంతో మృతి... వివాహేతర సంబంధం విషాదాంతం..
శృంగార జీవితంలో కొత్తదనాన్ని కోరుకునేవారు చాలామందే ఉంటారు. కొత్తదనం కోసం పోర్న్ వీడియోలు చూసి ప్రయోగాలు చేసేవారూ ఉంటారు. అయితే ఆ ప్రయోగాలు విఫలమైతే కొన్నిసార్లు అసలుకే ముప్పు రాక తప్పదు. మహారాష్ట్రలో ఓ జంట ఇలా కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటనలో ఆమె ప్రియుడు మృతి చెందాడు. ఖాపర్ఖేడా పట్టణంలోని ఓ లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇదీ జరిగింది...
ఖాపర్ఖేడాకు చెందిన ఓ యువకుడికి 30 ఏళ్ల ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఐదేళ్లుగా ఈ ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. తరుచూ లాడ్జికి వెళ్లి గడపటం వీరికి అలవాటు. ఇదే క్రమంలో గురువారం(జనవరి 7) రాత్రి ఖాపర్ఖేడాలో ఉన్న ఓ లాడ్జికి వెళ్లారు. రొటీన్ శృంగారం పట్ల బోర్ కొట్టిందో లేక కొత్తగా ట్రై చేయాలనుకున్నారో తెలియదు గానీ.. మొత్తానికి వీళ్లు చేసిన ప్రయోగం బెడిసికొట్టి ప్రాణాల మీదకు తెచ్చింది.

రోప్.. శృంగారం... బెడిసికొట్టి...
లాడ్జి గదిలో ఆ మహిళ తన ప్రియుడిని కుర్చీలో కూర్చోపెట్టి తాడుతో కట్టేసింది. అతని కాళ్లు,చేతులు కుర్చీకి కట్టేసిన తర్వాత ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత శృంగారం మరింత రక్తి కట్టాలని ప్రియుడి మెడను కూడా ఆమె తాడుతో కుర్చీకి కట్టేసింది. అనంతరం ఆమె వాష్ రూమ్‌కి వెళ్లి తిరిగొచ్చేసరికి ఆమె ప్రియుడు అచేతనా స్థితిలో కనిపించాడు. అతను కూర్చొన్న కుర్చీ కొద్దిగా పక్కకు జరగడం,ఆ వెంటనే అతని మెడ చుట్టూ ఉన్న తాడు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక అతను మృతి చెందాడు.

వివాహేతర సంబంధం విషాదాంతం...
వెంటనే ఆ మహిళ లాడ్జి సిబ్బందిని పిలవగా.. హుటాహుటిన పరిగెత్తుకొచ్చి మెడ చుట్టూ ఉన్న ఆ తాడును తొలగించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆ మహిళను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొన్నేళ్లుగా అతనితో తనకు వివాహేతర సంబంధం ఉందని ఆ మహిళ పోలీసులతో చెప్పింది. ఆమె సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.